Sunday, November 17, 2024

Indrakeeladri – శ్రీ సరస్వతి దేవిగా కనకదుర్గమ్మ దర్శనం…

ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరోచింత, జ్ఞాన, నీల, ఘట, కిడి అంతరిక్ష మహా సరస్వతులుగా సప్త నామాలతో వెలసిల్లే వాగ్దేవి ఆ సరస్వతి దేవి. ప్రాణుల నాలుక పైన నటించే బుద్ధి ప్రదాయిని గా సరస్వతీ మాత విరాజిల్లుతోంది. అటువంటి ఆ మహా సరస్వతి దేవి అలంకరణలు నేడు శ్రీ కనకదుర్గమ్మ వారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

.విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం లో శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రాత్రి 12 గంటల నుండి అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండగా ఉదయం 2 గంటల నుండి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి క్యూ లైన్ ల ద్వారా చేరుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శుక్రవారం విఐపి దర్శనాలనురద్దు చేశారు. ఘాట్ రోడ్డు పైకి ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదు. ప్రత్యేక బలగాలతో భక్తుల రద్దీని రూప్ వేల సహాయంతో నియంత్రిస్తున్నారు.

అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటలకు పైగా సమయం పడుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టి బందోబస్తును సిపి క్రాంతి రానా టాటా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వారం సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు సుమారు 5 లక్షలకు పైగా భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement