Friday, November 15, 2024

Indrakeeladri – దుర్గమ్మ సేవలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి,మంత్రి శ్రీధర్

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అమాత్యులు
ఘన స్వాగతం పలికిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే రెండో అతిపెద్ద దేవాలయమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మ వారిని తెలంగాణ రాష్ట్ర మంత్రులు దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు లు మంగళవారం విచ్చేయగా దేవాదాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎస్ రామారావు లు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులకు ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు లకు కమిషనర్ అమ్మవారి శేష వస్త్రం, చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయాలు వైదిక కమిటీ సభ్యుడు శంకర సాండిల్య ఇతర ఆలయ అధికారులు ఉన్నారు.

తెలుగు ప్ర‌జ‌లంద‌రూ చ‌ల్ల‌గా ఉండాలి ….

- Advertisement -

ద‌ర్శ‌నానంత‌రం భ‌ట్టి మీడియాతో మాట్లాడుతూ, ఎన్నో ఆశలు ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వ పాలనలో సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నాన‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సమగ్ర అభివృద్ధి చేయడానికి అమ్మవారు ఆశీర్వదించాలని ప్రార్ధించ‌న‌ట్లు చెప్పారు. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో చల్లగా ఉండే విధంగా అమ్మవారి దీవించాలని కోరాన‌ని వెల్ల‌డించారు.. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని కనుకదుర్గ అమ్మవారిని వేడుకున్నాన‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement