Wednesday, October 2, 2024

Indrakeeladri – రేపు బాలా త్రిపుర సుందరీ దేవిగా ద‌ర్శ‌నం

దుర్గ‌మ్మా న‌మోన‌మామి
సంబురంగా మొద‌లైన న‌వ‌రాత్రి ఉత్స‌వాలు
బెజ‌వాడ‌కు క్యూ క‌ట్టిన భ‌క్త‌జ‌నం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఎన్టీఆర్ జిల్లా బ్యూరో: విజ‌య‌వాడ‌లో శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు సంబురంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ తల్లి రేపు బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వ‌నున్నారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైన‌ద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. బాలా మంత్రం సమస్త దేవీమంత్రాల్లోనే ముఖ్యమైంది. అందుకే విద్యోపాసకులకి మొట్టమొదటగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహా త్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే తొలి దేవత శ్రీబాలాత్రిపురసుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణవలం అందించే అలంకారంలో శ్రీబాలా త్రిపుర సుందరీ దేవి దర్శనమిస్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement