Tuesday, November 26, 2024

Indrakeeladri – దుర్గమ్మను దర్శించుకున్న 13 లక్షల మంది భక్తులు… రూ.7 కోట్లకు పైగా ఆదాయం రాక

.ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరోభక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా శాఖల సమన్వయంతో శరనవరాత్రి ఉత్సవాలను విజయవంతంగానిర్వహించామని, ఉత్సవాలలో 12 లక్షల 80 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని జిల్లా కలెక్టర్ ఎస్డిల్లీరావు అన్నారు.నవరాత్రి ఉత్సవాలపై నగరంలోని కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావుమాట్లాడుతూ ఈనెల 15వ తేది నుండి నేటి వరకు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని సుమారు 12 లక్షల 80 వేలమంది భక్తులు దర్శించుకున్నారన్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లతోవిజయవంతం చేశామన్నారు. ఉత్సవాలలో ఎదురైన లోటుపాట్లను దృష్టిలో పెట్టుకుని రానున్న ఉత్సవాలలోపునరావృతం కాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులుపోలీస్, దేవాదాయ, మీడియా సహకారంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించామన్నారు.

భవాని భక్తులకుప్రస్తుతం అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించి మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పించేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు.ముఖ్యంగా వైద్య పరంగాను కొంత సేపు సేదతీరేందుకు అవసరమైన స్థలం, టాయిలెట్ల సూచకలను తెలిపేబోర్డులను అదనంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులకు కనీసం అందించే లడ్డూలవిషయంలో ప్రత్యేక సాంకేతిక విధానాన్ని పరిశీలిస్తామన్నారు. ఉత్సవాలను డాక్యూమెంటేషన్ చేస్తున్నామని, దీనిద్వారా తదుపరి శరనవరాత్రి ఉత్సవాలకు లోటుపాట్లను సరిదిద్ది భక్తులకు అదనపు సౌకర్యాలు కల్పించేందుకుఅవకాశం ఉంటుందన్నారు.

నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజు అయిన సోమవారం తప్పోత్సవాన్ని విజయవంతంగానిర్వహించామని వైధిక కమిటీ వేదపండితుల నిర్ణయం మేరకు హంస వాహనంపై పరిమిత సంఖ్యలో అనుమతించడంజరిగిందని కలెక్టర్ తెలిపారు.ఈ ఏడాది (2023) అమ్మవారి ఉత్సవాలలో ఇప్పటివరకు 20 రూపాలయ లడ్డూ ప్రసాదంలో 22,23,549 టిక్కెట్ల ద్వారా 4 కోట్ల 44 లక్షల 70 వేల 980 రూపాయలు, 500 దర్శన టిక్కెట్లలో 25,086 టిక్కెట్లువిక్రయాల ద్వారా 1 కోటి 25 లక్షల 43 వేల రూపాయలు, 300 దర్శన టిక్కెట్లలో 18,249 టిక్కెట్లు విక్రయాలద్వారా 54 లక్షల 74వేల 700 రూపాయలు, 100 దర్శన టిక్కెట్లలో 35,008 టిక్కెట్లు విక్రయాల ద్వారా 35లక్షల 800 రూపాయలు, కేశఖండనలో 1,16,899 టిక్కెట్ల ద్వారా 46 లక్షల 75 వేల 960 రూపాయలుఆదాయం వచ్చినట్లు తెలిపారు.

గత ఏడాది (2022) సెప్టెంబర్ 26వ తేది నుండి అక్టోబర్ 4వ తేది వరకు నిర్వహించిన ఉత్సవాలలో15 రూపాలయ లడ్డూ ప్రసాదంలో 11,56,973 టిక్కెట్ల ద్వారా 1 కోట్ల 73 లక్షల 54 వేల 595 రూపాయలు,500 దర్శన టిక్కెట్లలో 20,394 టిక్కెట్లు విక్రయాల ద్వారా1 కోటి 1 లక్షల 97 వేల రూపాయలు, 300 దర్శనటిక్కెట్లలో 23,818 టిక్కెట్లు విక్రయాల ద్వారా 71 లక్షల 45 వేల 400 రూపాయలు, 100 దర్శన టిక్కెట్లలో9,600 టికెట్ల విక్రయాల ద్వారా 49లక్షల 60 వేల 300 రూపాయలు, కేశఖండనలో 45,176 టిక్కెట్లద్వారా 11 లక్షల 29 వేల 400 రూపాయలు ఆదాయం వచ్చినట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement