Tuesday, November 26, 2024

కనకదుర్గమ్మకు కాసుల వర్షం.. వివిధ రూపాల్లో మూడున్నర కోట్ల రూపాయల ఆదాయం

.ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరోవిజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మ వారికి కాసుల వర్షం కురిసింది. అమ్మవారి ప్రసనానికి వచ్చే భక్తులు నిత్యం నిర్వహించే పలు సేవలతో పాటు, దర్శనం టికెట్లు ద్వారా, పెద్ద ఎత్తున భక్తులు సమర్పించే విరాళాలకు తోడు హుండీల రూపంలో అమ్మవారికి ఆదాయం సమకూరింది. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ ఆధ్వర్యంలో అధికారులు కుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.

దేవస్థానములో 19 రోజుల హుండీ లెక్కింపు ద్వారా అమ్మవారి ఆలయానికి సుమారు మూడున్నర కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఇందులో బంగారం 800 గ్రాములు, వెండి 6 కేజీల 600 గ్రాములు ఉండగా పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీ ని కూడా భక్తులు సమర్పించారు. విదేశీ కరెన్సీ కి సంబంధించి యూఎస్ఏ 715 డాలర్లు, కెనడా 210 డాలర్లు, ఆస్ట్రేలియా 225 డాలర్లు, సింగపూర్ 120 డాలర్లు, చైనా 1000 యువాన్లు, ఇంగ్లాండ్ 10 పౌండ్లు మలేషియా 23 రింగేట్లు, ఉమెన్ 2.5 రియల్, కత్వార్ 142 రియల్, స్వీడన్ 120 క్రోనార్, యూఏఈ 285 డిన్నర్స్, కువైట్ 1.75 దినార్లు, సౌదీ 1 రియల్ రూపంలో అమ్మవారి ఆలయానికి ఆదాయం సమకూరింది. అలాగే ఆన్లైన్ హుండీ ద్వారా రూ 1, 07,275/- రూపాయల నగదును విరాళంగా భక్తులు అమ్మవారికి చెల్లించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement