మాజీ క్రికెటర్, స్టైలిష్ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ కానున్నారు. జాతీయ పార్టీ బీజేపీలో ఆయన చేరనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే లక్ష్మణ్ తో బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపినట్టు సమాచారం. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ. క్రికెట్ ఫ్యాన్స్ అంతా అభిమానించే లక్ష్మణ్ ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది.
బీజేపీలో చేరడానికి వివీఎస్ లక్ష్మణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లక్ష్మణ్ బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ ను రానున్న ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోందని సమాచారం. లక్ష్మణ్ చేరికపై త్వరలోనే బీజేపీ అధికారిక ప్రకటన చేయనుందని చెపుతున్నారు.