విశాఖ పట్నం, ప్రభ బ్యూరో – . విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీలో నూతనంగా నిర్మించిన సెంటినరీ భవనాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ ప్రారంభించారు. అనంతరం శతాబ్ది వేడుకల పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ధనకర్ ఈ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఆంధ్ర మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులతో కలిసి ఉపరాష్ట్రపతి ధనకర్ ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్ కి చేరుకున్న ఉపరాష్ట్రపతి శతాబ్ది వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం తూర్పు నావికాదళ అధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైనికుల గౌరవ వందనాన్ని ఉప రాష్ట్రపతి స్వీకరించారు .. అంతకుముందు విశాఖకు వచ్చిన ఉప రాష్ట్రపతికి అపూర్వ ఘనంగాస్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా ఇన్ చార్జి మంత్రి విడదల రజని పుష్పగుచ్చాలను అందజేసి ఘన స్వాగతం పలికారు. ఇక ఉపరాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, జిల్లా ఇంచార్జి మంత్రి విడుదల రజని , రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు.