Tuesday, November 19, 2024

India: డ్రోన్‌ వినియోగానికి గైడ్‌లైన్స్‌ ఇవే.. కేంద్రం ఏం కండిషన్స్‌ పెంట్టిందంటే..

డ్రోన్ల వినియోగంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణపై కేంద్ర పౌర విమానయానశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మేరకు డ్రోన్ల ట్రాఫిక్‌ నిర్వహణ ప్రణాళికను వెల్లడించింది. వీటికి అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు, తృతీయపక్ష సేవలు అందించే సంస్థలు విధులను నిర్వర్తించాల్సిఉంటుంది. డ్రోన్లన్నీ 1,000 అడుగుల ఎత్తుకు మించకుండా ఎగరాల్సి ఉన్నందున ఆ మేరకు నిబంధనలు రూపొందించింది.

ప్రస్తుతం వాయు మార్గాలపై ‘ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ (ఏటీఎం) విధానం అమల్లో ఉంది. ఇది మానవ రహత విమానాల నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతో కొత్త విధానాన్ని రూపొందించింది. మానవరహిత డ్రోన్ల ట్రాఫిక్‌ నియంత్రణకు సంబంధించి ప్రస్తుత ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ (ఏటీఎం) వ్యవస్థ మార్గదర్శకాలను అక్టోబర్‌ 24న జారీచేయడమైంది.

డ్రోన్లను మానవ రహత విమానాలుగా పరిగణిస్తున్నందున దీనికోసం అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌ క్రాప్ట్‌ సిస్టం ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ను రూపొందిం చింది. దీన్ని యూటీఎంగా వ్యవహరిస్తోంది. ఇది ఆటోమేటిక్‌ ఆధా రిత సాప్ట్‌వేర్‌ సహకారంతో పనిచేస్తుంది. సాంప్రదాయ మార్గాలను ఉపయాగించి గగనతలంలో మానవ రహిత విమానాలను ఏకీకృతం చేయ డానికి వాటికి ఖరీదైన హార్డ్‌వేర్‌ను అమర్చాల్సి రావొచ్చు. బహుశా ఇది సాద్యమయ్యే పనికాదు. అందుచేత దీనికి ప్రత్యేక, ఆధునిక సాఫ్ట్‌వేర్‌ ఆధారిత, ఆటోమేటెడ్‌ యూఎఎస్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను రూపొందించాలి. అటువంటి వ్యవస్థలు భవిష్యత్తుల్లో ఏటీఎం వ్యవస్థల్లో వీలీనం కావొచ్చు.

అదేవిధంగా గగనతలంలో మానవరహిత, మానవ సహిత విమానాలను ఒకదానినొకటి నిరంతరం వేరు చేయడానికి యూటీఎం, ఏటీఎం పరస్పర ఏకీకరణ అవసరం.
ప్రైవేటు సంస్థలు రిజిస్ట్రేషన్‌, ్లఫట్‌ ప్లానింగ్‌, ఎగిరే డ్రోన్ల మధ్య దూరం ఉండేలా చూడడం, వాతావరణం సమాచారం తెలపడం వంటి సేవలు అందించవచ్చు. పైలట్లతో నడుస్తున్న విమానాలు కూడా ఎక్కడ ఉన్నాయన్న సంగతినీ తెలుసుకోవచ్చు. యూటీఎం వాతావరణ వ్యవస్థకు మద్దతుగా బీమా, డేటా విశ్లేషణ వంటి అనుబంధ సేవలను అందించడానికి అనుబంధ సేవా ప్రదాతల సమితి కూడా అనుమతించబడుతుంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసే డిజిటల్‌ స్కై వ్యవస్థ ద్వారా డ్రోన్‌ నిర్వా#హకులు అనుమతులు పొందాల్సి ఉంటుంది. డ్రోన్లు ప్రయాణం విషయమై ఏర్పాటు చేసే కేంద్రానికి ప్రతి నిర్వా#హకుడు కూడా సమాచారం ఇవ్వాలి. అది ఏ సమయంలో ఎక్కడ ఎగురుతోందన్న వాస్తవ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపిస్తుండాలి. ఇది నేరుగాగానీ, తృతీయ పక్ష సేవలు అందించే సంస్థ ద్వారాగానీ ఇవ్వవచ్చు. ఈ సేవలు అందించే సంస్థకు తొలుత తక్కువ పరిధిలో ఉండే భౌగోళిక ప్రాంతాన్ని కేటాయిస్తారు. అనంతరం ఆ పరిధిని విస్తరిస్తారు. ఈ సేవలు అందించినందుకు ఆ సంస్థలు రుసుములు వసూలు చేయవచ్చు. ఇందులో కొంత భాగాన్ని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

మూడు ఆర్థిక సంవత్సరాలలో రూ. 120 కోట్ల కేటా యింపులతో డ్రోన్‌లు, డ్రోన్‌ విడిభాగాల కోసం ఉత్పత్తి- అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 15న ఆమోదించింది. డ్రోన్‌ నిబంధనలను 25 ఆగస్టు 2021న పౌరవి మానయాన శాఖ నోటిఫైచేసింది. కార్యకలాపాల నియంత్రణను సులభతరం చేసింది. వాటిని ఆపరేట్‌ చేయడానికి నింపాల్సిన ఫారమ్‌ల సంఖ్యను 25 నుంచి ఐదుకు తగ్గించింది. ఆపరేటర్‌ నుంచి వసూలు చేసే రుసుముల రకాలను 72 నుంచి నాలుగు తగ్గించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement