ఏపీలోని నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ సత్తా చాటింది. కుప్పం సహా పలు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. అయితే, కృష్ణా జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే కౌంటింగ్ లో వైసీపీ, టీడీపీలు సమానంగా సీట్లు గెలుచుకున్నాయి. అధికార వైసీపీ పార్టీ 14 సీట్లు గెలుచుకోగా…టీడీపీ కూడా 14 స్థానాల్లో విజయం సాధించింది. ఓ చోట ఇండిపెండెంట్లు ఒకరు గెలిపొందారు. దీంతో మున్సిపాల్ ఛైర్మన్ పదవిపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచి ఇండిపెండెంట్ అభ్యర్థి ఇప్పుడు కీలకంగా మారారు. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి అధికార వైసీపీ పార్టీకి మొగ్గు చూపుతారా ? లేక ప్రతి పక్ష టీడీపీ పార్టీకి మద్దతు తెలుపుతారా ? అనేది ఉత్కంఠగా మారింది. ఆయన ఎవరికి మద్దతు ఇస్తే.. ఆ పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ అవుతారు. కాగా, కొండపల్లి మున్సిపాలిటీలో జనసేన పార్టీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు ఖాతా తెరవలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి