Tuesday, September 17, 2024

Independence Day – డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ కళ్యాణ్

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – కాకినాడ – 78వ స్వాతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారికంగా పాల్గొన్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ మొట్టమొదటి సారి డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు..

అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది అమరుల త్యాగాల ద్వార వచ్చిన ఈ స్వాతంత్ర్యం వేడుకల వేళ తాము ఆనందించాల్సిన దానికంటే.. దేశ బాధ్యతను గుర్తు చేసుకునే రోజు అని.. ఇలాంటి బాధ్యతే తనను ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టిందని గుర్తు చేశారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన పలువురు స్వాతంత్ర్య యోదులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ గుర్తు చేశారు.

- Advertisement -

దీంతో పాటుగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, డొక్క సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం, ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాల గురించి పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకం తెచ్చిన ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో… అన్న క్యాంటీన్లతో 5రూపాయలకే భోజనం పెట్టే పథకం ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

ప్రజా సంపదన దుర్వినియోగం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. గత ఐదేళ్లు లా అండ్ ఆర్డర్ క్షీంచింది,స్కూల్ కి వెళ్లిన సుగాలి ప్రీతి ఇంటికి రాలేదన్నారు. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి,ఎక్కడ రాజీ పడకూడదని కోరారు.

సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి విచ్చలవిడి గా మాట్లాడితే సీరియస్ గా ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చారు. గత ప్రభుత్వం లో ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం అయిందన్నారు. శేషా చలం అడవులు లో కొట్టేసిన ఎర్ర చందనం కర్ణాటక లో అమ్ముకున్నారని ఫైర్‌ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement