బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ షాక్ ఇచ్చాయి. రెండు రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర శుక్రవారం మళ్లీ పెరగడం గమనార్హం. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500కి చేరుకోగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640కి చేరింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640వద్ద కొనసాగుతోంది. నిజామాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 61,640గా ఉంది. వరంగల్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,640గా ఉంది. ఇక విజయవాడతో పాటు, విశాఖటపట్నంలోనూ శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,400 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి కూడా బంగారం ధరలోనే పయణిస్తోంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 77,700వద్ద కొనసాగుతోంది.