ప్రభన్యూస్ : ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలు ఉమ్మడి జలాశయం తుంగభద్ర జలాశయానికి జలాశయంపై ప్రాంతాల్లో ఉత్తర కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోవడంతో జలాశయానికి ఉన్న 33 గేట్లలో 20 గేట్ల ద్వారా దిగువ ప్రాంతం తుంగభద్ర నదికి వరద నీటిని విడుదల చేస్తున్నట్లు బోర్డు సెక్షన్ అధికారులు తెలియజేశారు. జలాశయం పై ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో జలాశయానికి చేరుతున్న వరద నీటిని 10 గేట్లను రెండు అడుగుల మేర, మరో 10 గేట్లను ఒకటిన్నర అడుగు మేర పైకెత్తుతూ సుమారు 52014 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు.
అదేవిధంగా జలాశయంలోకి 61వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయానికి సంబంధించి విడుదల కానున్న కాలువలకు 9 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. 6 గంటల సమయానికి జలాశయం వద్ద 1631.81 అడుగులకు గాను 101.031 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.