Friday, November 22, 2024

పెరిగిన రాష్ట్ర వ్యవసాయ వృద్ధిరేటు..

సుపరిపాలన సూచిక-2021 (గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌-జీజీఐ)లో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధిలో ఏపీ భారీ పురోగతి సాధించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జీజీఐ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్ర వార్షిక వృద్ది రేటు- 2020-21లో 11.3 శాతంగా నమోదయింది. 2019లో కేవలం 6.3 శాతంగా ఉన్న వృద్ధి రేటు- రెండేళ్లలోనే అనూహ్యంగా పెరిగింది. ఆహార, వాణిజ్య పంటలతో పాటు ఉద్యానవనాలు, పాడిపరిశ్రమ, ఇతర అనుబంధరంగాలకు సంబంధించిన ఉత్పత్తులు, ఎగుమతులు భారీగా పెరగటమే దీనికి కారణం.

పంటల బీమా 20.2 శాతం నుంచి 26.1 శాతానికి చేరుకుంది. 2019లో 4.7 శాతంగా ఉన్న ఉద్యా వనవన పంటల ఉత్పత్తి వృద్ధి రేటు- 12.3 శాతానికీ, కేవలం 1.4 శాతంగా ఉన్న పాల ఉత్పత్తి వృద్ది రేటు- 11.7 శాతానికి ఎగబాకింది. మాంసం ఉత్పత్తి రేటు-లోనూ భారీ వృద్ది నమోదయింది. 2019లో జీజీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం 6.7 శాతంగా ఉన్న మాంసం వృద్ది రేటు- 10.3 శాతానికి పెరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement