Sunday, November 24, 2024

యువతులపై త‌గ్గ‌ని అత్యాచారాలు.. ఈ ఏడాది మరింత పెరిగిన హింస..

మహిళలపై దాడులను నియంత్రించేందుకు దిశ చట్టాన్ని తీసుకువచ్చి ప్రత్యేక భద్రతా చర్యలు ప్రభుత్వం చేపడుతున్నా అరాచకాలు మాత్రం గణనీయంగా పెరుగుతూ రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బాలికలపై లైంగిక హింసను అరికట్టేందుకు పోస్కోలాంటి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ దాడులు ఏ మాత్రం తగ్గని పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీస్‌ శాఖ విడుదల చేసిన క్రైం నివేదిక ఈ అంశాలను స్పష్టం చేస్తోంది. గత ఏడాదితో పోలిస్తే మహిళలపై హింస 21శాతం పెరిగినట్లు స్పష్టమౌతోంది. 2020లో రాష్ట్రవ్యాప్తంగా 14,603 కేసులు నమోదుకాగా, ఈ ఏడాదిలో 17,736 కేసులు నమోదు కావడం మహిళలపై పెరిగిన హింసను వెల్లడిస్తోంది. 2019లో 15 వేల 665, 2018లో 14 వేల 338, 2017లో 14 వేల 813 కేసులు నమోదయ్యాయి. గడిచిన నాలుగేళ్లుగా గణాంకాలను పరిశీలిస్తే ప్రతి ఏటా మహిళలపై హింసా దాడులు పెరుగుతూ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. స్పందన కార్యక్రమంలో కూడా మహిళల హింసకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా వచ్చాయి. ప్రతి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ శాఖ నిర్వహించే స్పందన కార్యక్రమంకు మొత్తం 1,63,033 అర్జీలు వస్తే రాగా వాటిలో 52శాతం మహిళలు ఇచ్చిన ఫిర్యాదులే ఉన్నాయి.

ఆపదలో ఉన్న మహిళలను తక్షణం ఆదుకునేలా ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. దిశకు ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నట్లు వెల్లడైంది. దిశ యాప్‌ను ఇప్పటి వరకు 97 లక్షల 41 వేల 943 మంది డౌన్లోడ్‌ చేసుకున్నారు గతంలో ఛార్జిషీట్‌ల నమోదుకు సంబంధించి సుదీర్ఘ సమయం పట్టేది. అయితే ఇప్పుడు పోలీస్‌ వ్యవస్థలో వచ్చిన మార్పులు టెక్నాలజీ సాయంతో కేవలం 42 రోజుల సమయంలోనే ఛార్జీషీట్లు దాఖలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఇక ఆస్తుల సంబంధించిన కేసుల్లో 6 శాతం తగ్గుదల నమోదైంది. గతానికి భిన్నంగా పోలీస్‌ శాఖలో వచ్చిన మార్పులతో సామాన్యుడు స్వేచ్ఛగా పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదులు చేస్తున్నారని, దీంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగాయని, అయినప్పటికీ గత ఏడాది కంటే 3 శాతం మాత్రమే కేసులు ఎక్కువ నమోదయ్యాయని అన్నారు. మొత్తం 45 వేల 440 కేసులకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని డీజీపీ సవాంగ్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement