Friday, November 22, 2024

గ్యాస్‌ బాదుడు.. పెరిగిన వాణిజ్య సిలిండర్లు

కర్నూలు, ప్రభన్యూస్ : జిల్లా వ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్‌ ధర పెరిగింది. దీంతో చిరు వ్యాపారులు వీధిన పడే దుస్తితి నెలకొంది. 20వేల నుంచి 25వేల వరకు జిల్లాలో కనెక్షన్‌ ఉన్నాయి. వీటిలో 7వేల వరకు చిన్న వ్యాపారులు, 18వేల వరకు పెద్ద వ్యాపారులు కనెక్షన్లు ఉన్నాయి. వాణిజ్య సిలిండర్‌కు ధరలు పెరిగాయి. కేవలం రూ.105.50 పెరగడం గమనార్హం. 19కిలోల సిలిండర్‌ ధర ఫిబ్రవరి మాసంలో 2014.50పైసలు ఉండగా రూ.2147కు చేరింది. ఆయిల్‌ కంపెనీలు ప్రతి నెల గ్యాస్‌ ధరలు పెంచడం లేదా తగ్గించడం అనవాయితీ. ఏడాది క్రిందట రూ.1000లు నుంచి 1.100 ధర కేవలం రూ 2.147లకు పెరిగింది.

ఈ వాణిజ్య సిలిండర్లు పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, టీస్టాట్‌, కార్పోరేట్‌ స్కూల్‌, కళాశాలలు, ఇంజనీరింగ్‌ కళాశాల లో భోజనం వసతి కల్పించే విద్యాసంస్థలు, టిఫిన్‌ సెంటర్లు, వాణిజ్య సిలిండర్లు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. జిల్లాలో సగటున నెలకు 1.11లక్షల వాణిజ్య సిలిండర్లు వినియోగిస్తున్నారు. ఒక్కొక్క నిర్వాహాకులు నెలకు 2,3 నుంచి 5 వరకు వాయు బండలు కొనుగోలు చేస్తారు. ఈ లెక్కన పెరిగిన ధరల ప్రకారం వ్యాపార వినియోగదారులపై ప్రతినెల రూ.1.20 కోట్ల భారం కానున్నది.

చిన్న సిలిండర్‌ వైపు చూపు..

జిల్లాలోని వ్యాపారులు వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడంలో గృహాలకు ఉపయోగించే సిలిండర్లను వినియోగిస్తున్నారు. గత ఏడాదిలో రూ.1100లు ఉన్న ధర ఏకంగా ఈ ఏడాది వాణిజ్య సిలిండర్‌ రూ.2147లకు పెరగడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement