Saturday, November 23, 2024

పెరిగిన సిమెంట్ ధ‌ర‌లు

సామాన్యుడికి అన్నీ భారంగానే మారుతున్నాయి. అన్ని ధ‌ర‌లు పెరుగుతూనే పోతున్నాయి.. త‌గ్గ‌డం లేదు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు, కూరగాయల ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సిమెంట్ బస్తాల ధరలు పెరిగాయి. 50 కిలోల బస్తాపై ధరను రూ.20-30 మేర పెంచుతున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో ధర పెంచినట్లు చెప్పారు. ధరల పెంపుతో సిమెంట్ బస్తా ధర రూ.300-350 మధ్యలో ఉంటుందని తెలిపారు.
సిమెంట్ ధ‌రను పెంచిన కంపెనీల్లో పెన్నా సిమెంట్స్, అల్ట్రాటెక్, ఇండియా సిమెంట్స్, సాగ‌ర్ సిమెంట్స్, శ్రీ‌సిమెంట్, ఓరియంట్ సిమెంట్, ఎన్సీఎల్ ఇండ‌స్ట్రీస్, దాల్మియా భార‌త్, రామ్ కో సిమెంట్స్ ఉన్నాయి. సిమెంట్ ధ‌రను పెంచిన కంపెనీల్లో పెన్నా సిమెంట్స్, అల్ట్రాటెక్, ఇండియా సిమెంట్స్, సాగ‌ర్ సిమెంట్స్, శ్రీ‌సిమెంట్, ఓరియంట్ సిమెంట్, ఎన్సీఎల్ ఇండ‌స్ట్రీస్, దాల్మియా భార‌త్, రామ్ కో సిమెంట్స్ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement