అమరావతి,ఆంధ్రప్రభ: ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లుకు పెంచగా.. తాజాగా ఎయిడెడ్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కూడా పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు గవర్నర్ సంతకం చేసిన గెజిట్ నోటిఫికేషన్ను బుధవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2022 జనవరి ఒకటో తేదీ నుంచి పదవీ విరమణ వయస్సు పెంపు అమల్లోకి వస్తుందని ఆ గెజిట్లో ప్రభుత్వం పేర్కొంది. ఈలోపు రిటైర్ అయిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కూడా గెజిట్లో పొందుపరిచింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement