Thursday, January 30, 2025

AP | వారికి గుడ్ న్యూస్ అందించిన సీఎం చంద్ర‌బాబు

  • వ‌ర‌ద‌ల్లో దెబ్బ‌తిన్న ఆటోల‌కు ప‌రిహారం పెంపు
  • త్వరలోనే అకౌంట్లలోకి విడుదల.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ‌తేడాది ఆగస్ట్ – సెప్టెంబర్ నెలల్లో సంభవించిన వరదల్లో దెబ్బతిన్న ఆటోలకు పరిహారం పెంచాలని నిర్ణయించింది. ఈ మేర‌కు సీఎం చంద్ర‌బాబు ఆదేశాలు జారీ చేశారు. వ‌ర‌ద్లో దెబ్బతిన్న ఆటోలకు ఇప్ప‌టికే రూ.10000 చొప్పున పరిహారం అందజేయగా.. ఆ మొత్తాన్ని రూ.20వేలకు పెంచుతూ రెవ‌న్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆటో కార్మికులకు కొంత ఊరట లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement