Saturday, January 25, 2025

KNL | గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో జనిత మోన్ స్కిల్ (సిమ్యులేషన్) ల్యాబ్ ప్రారంభం

కర్నూల్ బ్యూరో : కర్నూలు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో జనిత మోన్ స్కిల్ (సిమ్యులేషన్) ల్యాబ్ ను డా.చిట్టి నరసమ్మ, ప్రిన్సిపాల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు చేతుల మీదగా శుక్రవారం ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కెఎంసి ప్రిన్సిపల్, డా.చిట్టి నరసమ్మ మాట్లాడుతూ… ప్రతిష్టాత్మకమైన జనత స్కిల్ ల్యాబ్ స్టూడెంట్స్ నాలెడ్జ్ యాడ్ స్కిల్ డెవలప్ మెంట్ కోసం ఈ స్కిల్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… నర్సింగ్ విద్యార్థులు నిజసమయంలో చూడగలిగే వ్యాధి లక్ష‌ణాలను, పరిస్థితులను తెలుసుకోవడానికి ఈ ఆధునిక ప్రయోగశాల ల్యాబ్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆక్సిడెంట్ పేషంట్స్ అండ్ డెలివరీకి వచ్చే పేషెంట్లకు వైద్యం ఎలా అందించాలనే దానిపై బొమ్మల ప్రోగ్రామ్ ద్వారా నర్సింగ్ విద్యార్థులకు అవగాహన ఉండేందుకు అధునాత‌న బొమ్మల ల్యాబ్ ను ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమానికి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్, ఎన్.మంజులా రాణి, నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్, వి.ధనలక్ష్మి, నర్సింగ్ కళాశాల ట్యూటర్స్, శోభరాణి, శాంతి భవాని, మంజుల, సరళ కుమారి, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement