హైదరాబాద్ లోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే రెండు సార్లు జీఆర్ఎంబీ సమావేశం వాయిదా పడగా… తాజాగా మూడోమారు భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్‌రావు, ఓఎస్డీ దేశ్‌పాండే.. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ నారాయణరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణకు చెందిన చనాకా-కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటనగరం పంప్‌హౌస్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్‌లపై చర్చిస్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement