Friday, November 22, 2024

వ‌ర‌ద‌ల దృష్ట్యా.. రైలు ప్రయాణికులకు హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు

కేదరేశ్వరపేట (ప్రభ న్యూస్): విజయవాడ రైల్వే డివిజన్ ప‌రిధిలోని అన్ని ప్రధాన స్టేషన్లలో గురువారం నుండి ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. హసన్‌పర్తి – కాజీపేట మధ్య ప్రమాద స్థాయిలో నీటిమట్టం పొంగిపొర్లు తుండడంతో ముందుజాగ్రత్త చర్యగా రెండు వైపులా రైలు రాకపోకలను నిలిపివేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, ఒంగోలు తెనాలి, సామర్లకోట, ఏలూరు, రాజమండ్రి స్టేషన్ల వంటి అన్ని ప్రధాన స్టేషన్లలో ఈ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఈ హెల్ప్ డెస్క్‌లను టికెట్ చెకింగ్ సిబ్బంది నిర్వహిస్తున్నారు.
హెల్ప్ లైన్ నెంబర్లు

  1. విజయవాడ- 0866-2576924
  2. గూడూరు-7815909300
    రైళ్ల మళ్లింపులు, రద్దు , షార్ట్ టర్మినేషన్‌లకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్ డెస్క్‌ల సేవలను పొందవలసిందిగా ప్రయాణికులకు సూచించారు. మళ్లించిన రూట్లలో రైలు తిరిగేందుకు తరచుగా ప్రకటనలు , భోజన ఏర్పాట్లు కూడా డివిజన్ పొడవునా ప్రయాణికులకు అందేలా పర్య వీక్షిస్తున్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement