Friday, January 10, 2025

Breaking : తిరుపతి ఘటనలో.. ఇద్దరు సస్పెండ్, మరో ముగ్గురిపై బదిలీ వేటు

తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయగా, మరో ముగ్గురిపై బదిలీ వేటు వేశారు. టొకెన్ పంపిణీ కేంద్రం వద్ద నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన డీఎస్పీ రమణకుమార్, అక్కడి గోశాల ఇన్ ఛార్జి హరినాధ్ రెడ్డిలపై సస్పెండ్ వేటు వేశారు. ఇక తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ లను బదిలీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

తిరుపతిలో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ… ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. అలాగే జరిగిన సంఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement