Friday, November 22, 2024

AP | వచ్చే ఎన్నికల్లో వైసీపీదే అధికారం : విజయసాయి రెడ్డి

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయని ఆయన జోష్యం చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఆదివారం భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీలు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటే మూఢ నమ్మకం కాదన్నారు. ప్రజలకు సేవలు చేస్తూ, దళిత గోవిందం, సోషలిస్టు భావజాలం ప్రజలకు తీసుకువెళ్లిన నాయకుడు భూమన కరుణాకరరెడ్డి అని కొనియాడారు. వచ్చే ఎన్నికలలో14 స్థానాలకు 14 స్దానాల్లో గెలిచేలా భూమన కృషి చేస్తారని చెప్పారు.

ఐదు నెలల్లో రూ.53 మూడు వేల కోట్ల అప్పు..

సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం మొదలైన నుంచి రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయన్నారు. ఒక మాఫీయ రాజ్యం ఏలుతోందని, అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా కనిపించడం లేదన్నారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

4 నెలల్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయన్నారు. జగన్‌పై వ్యక్తిత్వ హననం చేస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం చేశారని విమర్శించారు. ఈ ఐదు నెలల్లో 53వేల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు.

- Advertisement -

వైఎస్‌ జగన్‌ చేసిన అప్పులు నిర్మాణాత్మకంగా ఉన్నాయని, మరి చంద్రబాబు చేస్తున్న అప్పులు ఏమై పోయాయని ప్రశ్నించారు. పార్టీ బలోపేతానికి, జవసత్వాలు పార్టీ నిర్మాణం చేస్తామన్నారు. బలమైన కార్యకర్తలకు న్యాయం చేస్తామన్నారు.

జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం

చివరగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుతో ఢీ కొట్టడానికి తాము ఎప్పుడు సిద్ధమేనని అన్నారు. కార్యకర్తల కోసమే నిలబడతానని గ్రూపులు కట్టడానికి రాలేదన్నారు. వైఎస్ఆర్ కుటుంబంతో 49 ఏళ్లుగా పనిచేస్తున్నానని, జగన్ మోహన్ రెడ్డి మళ్లీ సీఎంగా చేయడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలు, సలహాలు, పాటిస్తూ మందుకు వెళ్తానని, అనివార్య కారణాలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యక్రమానికి దూరంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యారాయణ, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం సందేశాలను భూమన చదివి వినిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement