ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి భూముల కొనుగోలు, గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ ఏర్పాటు చేయడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా సిట్ ఏర్పాటుపై స్టే విధిస్తూ గతేడాది సెప్టెంబర్ 15న ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ సర్కార్ జీవో జారీ చేసింది. ఈ క్రమంలో పున: సమీక్ష అధికారం ఉందా లేదా ? అన్నది మాత్రమే విచారిస్తామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపించారు.
అమరావతి భూములు కొనుగోలు అంశంలో.. సిట్ ఏర్పాటుపై సుప్రీంలో విచారణ
Advertisement
తాజా వార్తలు
Advertisement