Thursday, September 19, 2024

Exclusive | క్రిమిన‌ల్.. జ‌స్టిస్‌ ! కాదంబ‌రి కేసులో మంత్రాంగ‌క‌ర్త‌పై గురి…

  • ఫస్ట్ సీక్వెల్‌లో ఐపీఎస్ అధికారులు
  • అప్రూవ‌ర్‌గా మారిన‌ ఓ కీల‌క అధికారి
  • తెరమీదకు వ‌స్తున్న‌ తాడేపల్లి దర్బార్
  • సంచాలకుడే వ్యూహకర్త అంటూ ఆధారాలు
  • ఆ మంత్రాంగ క‌ర్త‌కు అర‌దండాలు త‌ప్ప‌వా?
  • త్వరలో ఫైవ్ మెన్ పోలీస్ టీమ్ సహా అరెస్ట్
  • ఫైన‌ల్ ప్రొసీజ‌ర్ ప్రిప‌రేష‌న్‌లో ప్రభుత్వం బిజీ
  • సెంట్రల్​ జైల్లోనే క్లైమాక్స్​ సీక్వెన్స్​ సీన్​
  • నిజం కానున్న రాష్ట్ర ప్ర‌జ‌ల ఊహాగానాలు

ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్ : ఏపీ, మహారాష్ట్ర‌ పోలీసులను వాడుకోవ‌డంలో లీడ‌ర్ల తీరు మ‌హాద్భుతం అన్న‌ది మ‌రోసారి స్ప‌ష్టం అయ్యింది. క్రిమిన‌ల్ జ‌స్టిస్ విష‌యంలో రాజకీయ ప్రతర్థులను జైల్లో తోసేందుకు అన్ని అవ‌కాశాలు సానుకూలిస్తున్నాయి. ప్రత్యర్థి రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు చెలరేగిన ఓ నేత మెడకు కేసు ఉచ్చు బిగుస్తున్న‌ట్టు తెలుస్తోంది.

220 రోజుల కిందట అంటే జనవరి 31న సినీ నటి డాక్టర్ కాదంబరి కేసు వ్యవహారంలో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు సినిమా స‌న్నివేశాల‌ను త‌ల‌పిస్తోంది. ఏడు నెలల పాటు ఈ ఫస్ట్ సీక్వెల్ అంతంగా ఆకట్టుకోలేదు. ఈ సీక్వెల్‌లో కాదంబరి నిందితురాలు. గుట్టు చప్పుడు కాకుండా ముంబ‌యి, కొండపల్లి వీటిపీఎస్ గెస్ట్ హౌస్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లోనే స్ట్రీన్‌ ప్లే సాగింది.

ఇక.. ప్ర‌స్తుతం తెరమీదకు రెండో సీక్వెల్ వ‌చ్చింది. కాందంబరీ ఫైర్ బ్రాంబ్ అవతారంలో కనిస్తోంది. దీంతో ముగ్గురు ఐపీఎస్ ఆఫీస‌ర్లు సహా.. ఫైవ్ మెన్ పోలీస్ టీమ్‌కు ముచ్చమటలు పడుతున్నాయి. తాజాగా తాడేపల్లి దర్భార్ మంత్రాంగ కర్త కూడా తెరమీదకు వచ్చారు.

ఆయన్ని పోలీస్ వ్యాన్ ఎక్కించే ఆధారాల వేటలో ప్రభుత్వం నిమగ్నమైంది. నిందితులుగా చెబుతున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు మాజీ సీఎం అంతరంగీకుడిని కూడా అరెస్ట్ చేయటం ఖాయమని ఏపీలో టాక్ వినిపిస్తోంది. ఇందుకు ఒక్కొక్క ఆధారం తెరమీదకు వ‌స్తున్న‌ట్టు అధికార పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అరెస్టుకు ఆధారాలెన్నో…

పోలీసు ఉన్నతాధికారుల విచారణ నివేదిక ప్రకారం.. ఓ జూనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అసలు కథను రివీల్ చేశారు. ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండబ‌ద్ద‌లుకొట్టేశారు. ‘‘జనవరి 31న తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సీపీ, డీసీపీ ఇద్దరూ దర్బారుకు వెళ్లారు. అక్కడ నిఘా అధికారి సిద్ధంగా ఉన్నారు. ముంబ‌యిలో ఓ యాక్టర్ ఉంది. వెంటనే తీసుకు వచ్చి సంగతి తేల్చాలి. ఇందుకు ఓ నాయకుడిని మీకు ఇస్తాం. గుట్టు చప్పుడు కాకుండా ఈ టాస్క్ పూర్తి చేయాలి’’ అని ఈ ముగ్గురిని ఆ లీడర్​ ఆదేశించారు. కేసు చేధన బాధ్యతను డీసీపీకి అప్పగించారు.

- Advertisement -

తెలియకుండానే క్లూస్​ వదిలేశారు..

అయితే.. ఈ అక్రమ వ్యవహారాన్ని మూడో కంటికి తెలియకుండా గోప్యంగా ఉంచాలని వారంతా భావించారు. కానీ, ప్రతి ప్లాన్​లోనూ వారికి తెలియకుండానే నేరానికి సంబంధించిన క్లూస్​.. వాటి సిగ్నేచర్స్​ వదిలేస్తూ చట్టం ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ వ్యవహారం వెలుగు చూడటంతో అధికార పార్టీకి కాదంబరి జత్వానీ ఓ బ్రహ్మాస్త్రంలా మారింది. ఇక, తాడేపల్లి దర్బారులో ఏక పక్ష సంచాలకుడికి ఉచ్చు బిగిసింది. మరో వారం రోజుల్లో ముగ్గురు ఐపీఎస్ అధికారులతోపాటు.. ఫైవ్ మెన్ పోలీస్ టీమ్ సహా మాజీ సీఎం అంతరంగీకుడిని అరెస్టు చేయటానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.

సెంట్రల్​ జైలే క్లైమాక్స్ సీన్​​..

ఇప్పటికే ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్​ను పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు. ఇతర దేశాలకు పారిపోకుండా కల్లెం వేశారు. అదే ఈ కేసులో ఇప్పటి వరకూ పోలీసులను నిందితులుగా చేర్చలేదు. రెండు మూడు రోజుల్లో మరో ఆరుగురు పేర్లు జత చేయటానికి కసరత్తులు జరుగుతున్నాయి.

ఈ కేసులో నమోదు చేసిన ఐపీసీ సెక్షన్లలో 354 కూడా ఉంది. ఈ ప్రకారం మహిళపై అత్యాచార యత్నం కేసు నమోదు అయ్యింది. అంటే ఈ కేసులో నిందితులను అరెస్టు చేస్తే.. కనీసం మూడు నెలలు బెయిల్ రాదు. 90 రోజులు సెంట్రల్ జైలులో గడపక తప్పదు. ఏది ఐమైనా ఈ క్రిమినల్​ జస్టిస్​ స్వీకెల్​లో అరెస్టు పర్వమే క్లైమాక్స్ సీన్ అనేది స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement