అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజధాని రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. వారికిచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటీసులను న్యాయస్థానం కొట్టివేసింది. భూసేకరణ కింద రైతులకు గతంలో సీఆర్‌డీఏ ఈ ప్లాట్లు ఇచ్చింది. వీటిని రద్దు చేస్తూ 862 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు.
ప్లాట్ల రద్దు.. సీఆర్‌డీఏ చట్టం, మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమని నోటీసులను సవాల్ చేస్తూ పలువురు రైతులు హైకోర్టుకు వెళ్లారు. అయితే, చట్టంలో మార్పులు చేశామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులు చెల్లవని స్పష్టం చేసింది.