అమరావతి, ఆంధ్రప్రభ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఆరో రోజున 7 బిల్లులు పలువురు మంత్రులు శాసనసభలో ఆమోదానికి ప్రవేశ పెట్ట నున్నారు. అలాగే పలు అంశాలపై చర్చ జరుగనుంది. ముందుగా ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024 బిల్లు ప్రవేశ పెట్టనున్నారు.
పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఏపీ మునిసిపల్ లా సవరణ బిల్లు 2024 ప్రవేశ పెట్టనుండగా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024, ఏపీ ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేష్రన్ సవరణ బిల్లు 2024, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెం నాయుడు ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు 2024 బిల్లులు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు.
అదే విధంగా అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వార్షిక ఆడిట్ రిపోర్టు, 2017-18, 2018-19, గత ప్రభుత్వ హయాంలో రిపోర్టులు, ఆలస్యం అవడానికి కారణాలను సభ ముందు మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశ పెట్టనున్నారు.
డివిజినల్ రైల్వే యూసర్స్ కన్సల్టేటివ్ కమిటీలో ప్రతినిధిగా ఎమ్మెల్యేలలో ఒకరిని ఎన్నుకోవడానికి అసెంబ్లీ ముందుకు మంత్రి బి.సి.జనార్ధన్ రెడ్డి తీసుకురానున్నారు. 2024-25 గ్రాంట్స్ కోసం డిమాండ్స్‌పై చర్చ చేపట్టనున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయితీరాజ్ డిమాండ్ కింద 11,846.92 కోట్ల గ్రాంట్ గ్రామీణాభివృద్ధి డిమాండ్ కింద 7949.87 కోట్ల గ్రాంటు, అటవీ, సాంకేతిక, నైపుణ్య, పర్యావరణం కింద 687.58 కోట్ల గ్రాంట్ చర్చ జరుపనున్నారు.
మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్య కింద 29,909.31 కోట్ల గ్రాంట్, ఉన్నతవిద్య కింద 2326.68 కోట్ల గ్రాంట్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కింద 1217.16 కోట్ల గ్రాంట్, ఐటీ, ఎలక్ట్రాన్రిక్స్, కమ్యూనికేషన్స్ కింద 500.51 కోట్ల గ్రాంట్, మంత్రి సత్యకుమార్ యాదవ్ వైద్యం ఆరోగ్యం కింద 18421.04 కోట్ల గ్రాంట్, మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సోషల్ వెల్ఫేర్ కింద 10,400.84 కోట్ల గ్రాంట్, మంత్రి గుమ్మడి సంధ్యారాణి మహిళా, శిశు సంక్షేమం కింద 4285.95 కోట్ల గ్రాంట్, ఆదివాసీ సంక్షేమం కింద 4541.86 కోట్ల గ్రాంట్, లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్ గ్రాంట్ ఎన్.ఎండి.ఫరూఖ్ మైనారిటీల సంక్షేమం కింద రూ.2808.75 కోట్ల గ్గ్రాంట్, అడ్మినిస్ట్ష్రేషన్ ఆఫ్ జస్టిస్ రూ.1227 కోట్లు గ్రాంట్ పై చర్చ చేపట్టనున్నారు.