విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు మంత్రి ఆదిమూలపు సురేశ్.. ఈ క్రమంలో ఆదివారం విశాఖ ఆర్కే బీచ్‌లో పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ పక్కకు ఒరిగింది. అయితే మంత్రి వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. దీంతో మంత్రి సురేశ్‌తోపాటు అక్కడే ఉన్న ఇతర మంత్రులు షాక్‌కుగురయ్యారు. మంత్రికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.జీ20 సదస్సులో భాగంగా విశాఖలో మారథాన్ , సాహస క్రీడలు నిర్వహిస్తున్నారు. మారథాన్‌ను మంత్రులు ఆదిమూలపు సురేశ్, విడుదల రజనీ, గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. అనంతరం నిర్వాహకుల ఆహ్వానం మేరకు మంత్రి సురేశ్ పారా గ్లైడింగ్‌కు సిద్ధమయ్యారు. ఈ ఈవెంట్‌ను మంత్రి రజనీ జెండా ఊపి ప్రారంభించారు. అయితే గాలి దిశ (విండ్ డైరెక్షన్) సహకరించకపోవడంతో సురేశ్ పయణిస్తున్న గ్లైడర్ కుదుపులకు గురైంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement