Saturday, November 23, 2024

పోలవరంలో అగాధాలు పూడ్చే పనులు ప్రారంభం

పోలవరం, మార్చి 8: పోలవరం ప్రాజెక్ట్ లోని గ్యాప్ 1, 2 ల్లో గతంలో వచ్చిన వరదల వల్ల ఏర్పడిన అగాధాలను పూడ్చే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్ (డి డి ఆర్ పీ) ఆమోదించిన డిజైన్ ప్రకారం ఈ పనులు ప్రారంభం అయ్యాయి. జలవనరుల శాఖ ఎస్ఈ నరసింహమూర్తి, ఈఈ లు మల్లికార్జున రావు, పాండురంగయ్య, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) సి జి ఎం ఎం. ముద్దు కృష్ణ, జనరల్ మేనేజర్ గంగాధర్, అసోసియేట్ జనరల్ మేనేజర్ మురళి పమ్మి గ్యాప్ 1, 2 లలో పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు.

ఈ రెండు ప్రాంతాల్లో ఏర్పడిన అగాధాలను పూడ్చటంలో భాగంగా ఇసుకను అక్కడ డోజర్ల ద్వారా నింపుతున్నారు. ఇసుకను నింపిన తరువాత వైబ్రో క్యాంపక్షన్ విధానం ద్వారా ఆ ప్రాంతాన్ని గట్టి పరుస్తారు. ఇది పూర్తి ఐన తరువాత తాజాగా నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్ హె చ్ పి సి ) డయాఫ్రామ్ వాల్ పటిష్టతపై ఇచ్చిన నివేదిక ఆధారంగా డీడీ ఆర్ పీ ఆమోదం పొందిన తరువాత పనులు చేపడతారు. డయాఫ్రామ్ వాల్ పనులు పూర్తి ఐన తరువాత ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ (ఈ సి ఆర్ ఎఫ్) పనులు ప్రారంభం అవుతాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement