Saturday, November 23, 2024

గ్రేటర్ విశాఖ‌లో.. కొత్త‌గా 42 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు

విశాఖపట్నం (ప్రభన్యూస్‌ బ్యూరో) : మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో వైఎస్‌ఆర్‌ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల నిర్మాణం త్వరితగతిన సాగుతున్నాయి. గ్రేటర్‌ పరిధిలో 42 యూపీహెచ్‌సి భవనాలు నూతనంగా నిర్మిస్తుండగా మరో 24 సెంటర్ల భవనాలకు మరమ్మత్తులు చేయిస్తున్నారు. కొత్త హెల్త్‌ సెంటర్‌ నిర్మాణానికి రూ.80 లక్షల చొప్పున కేటాయించారు. దీంతో ఇప్పటికే 16 సెంటర్లు పునాదులు నిర్మాణం పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్నాయి. మరో 16 సెంటర్లు రూఫ్‌ లెవెల్‌లో ఉన్నాయి.

ఇక 10 సెంటర్లకు ఇటీవలే స్లాబ్‌ల నిర్మాణం పూర్తి చేశారు. అయితే ఆయా హెల్త్‌ సెంటర్లకు సంబంధించి తక్షణమే నిధులు మంజూరు కావాల్సి ఉంది. జీవీఎంసీలో ఆర్ధిక ఇబ్బందులు నేపధ్యంలో సాధారణ అభివృద్ధి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాల మేరకు చీఫ్‌ ఇంజనీర్‌ రామకృష్ణరాజు కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై వారిని హెల్త్‌ సెంటర్ల నిర్మాణానికి ఒప్పించగలిగారు.

అయితే ఇప్పటి వ రకు పూర్తి కావచ్చిన పనులకు సంబంధించి సుమారు రూ.10 కోట్లు నిధులు మంజూరు కావాల్సి ఉంది. ఆయా నిధులు మంజూరైతే మొత్తం 42 నూతన హెల్త్‌ సెంటర్ల భవనాలు వీలైనంత త్వరగా పూర్తి కానున్నాయి. ఇప్పటికే పలు భవనాలు నిర్మాణం వేగవంతంగా పూర్తి కావస్తుంది. ప్రస్తుతం వీటికి కూడా నిధులు కొరత వెంటాడుతుంది.

24 భవనాలకు మరమ్మత్తులు పూర్తి:-
ఇక గ్రేటర్‌ పరిధిలో 24 హెల్త్‌ సెంటర్లకు సంబంధించిన మరమ్మత్తులు పూర్తి చేశారు. ఒక్కొక్క హెల్త్‌ సెంటర్‌ మరమ్మత్తుకు సుమారు రూ.10 లక్షలు చొప్పున నిధులు కేటాయించారు. అయితే అన్ని మరమ్మత్తులు పూర్తి కావచ్చిన ఇంకా అన్నింటికి రంగులు వేయాల్సి ఉంది. త్వరలోనే ఈ పనులు పూర్తి కానున్నాయి. ఆయా హెల్త్‌ సెంటర్లు అందుబాటులోకి వస్తే పట్టణ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాట ులోకి రానున్నాయి. కావున వీటిని వేగంతంగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement