Saturday, November 16, 2024

Railway | వేసవి సెలవుల దృష్ట్యా రైల్వే కీలక నిర్ణయం..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో వారం, పది రోజుల్లో పాఠశాలలకు సెలవులు రానున్నాయి. వేస‌వి సెల‌వుల్లో సొంతూళ్ల‌కు వెళ్లే వారికి సంఖ్య‌తో పాటు రైళ్లలో రద్దీ కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. వేసవి రద్దీ నేపథ్యంలో పలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో.. 32 ప్రత్యేక రైలు సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు నడిచే ప్రత్యేక రైలు సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే అధికారులు పొడిగించారు. ముఖ్యంగా తిరుపతికి నడిచే పలు ప్రత్యేక సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది.

తిరుపతి- అకోలా, అకోలా- తిరుపతి, తిరుపతి- పూర్న, పూర్న- తిరుపతి, హైదరాబాద్- నర్సాపూర్, నర్సాపూర్- హైదరాబాద్, తిరుపతి- సికింద్రాబాద్, సికింద్రాబాద్- తిరుపతి, కాకినాడ- లింగంపల్లి టౌన్, లింగంపల్లి టౌన్- కాకినాడ, నర్సాపూర్- బెంగళూరు, బెంగళూరు- నర్సాపూర్ ఇలా.. మొత్తం 32 ప్రత్యేక సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement