ఏపీ సర్కార్ నియమించిన సలహాదారుల నియామకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవాదాయశాఖ సలహాదారు శ్రీకాంత్, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ నియామకాల పైన దాఖలైన వేర్వేరు పిటిషన్లపై ఈరోజు ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. నిష్ణాతులైన వారిని సలహాదారుడుగా నియమిస్తున్నామని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అలాగే మెరిట్స్ పై వాదనలు వినిపిస్తామని హైకోర్టుకు ఏజీ విన్నవించారు.
ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైనా రాజకీయాలు ఉంటే బయట చూసుకోవాలి అని.. వాటిని కోర్టు వరకు తీసుకురాకూడదని హెచ్చరించింది. రాజకీయాలు తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేయాలో తమకు తెలుసని హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగుల టీఏ, డీఏ కోసం మరో సలహాదారున్ని నియమిస్తారా? అని ప్రశ్నించింది. సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని వ్యాఖ్యానించింది.
- Advertisement -