Tuesday, November 26, 2024

Big story : బ్లడ్‌ బ్యాంకుల ఏర్పాటుకు ఇంపార్టెన్స్​.. పెరుగుతున్నవిష జ్వరాలు, పడిపోతున్న ప్లేట్‌లెట్స్‌ కారణం

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పెరుగుతున్న విష జ్వరాలు ఒకవైపు, కరోనా బారినపడిన వారి ఆరోగ్య పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండటం ఇంకోవైపు ప్రజలను ఊపిరాడకుండా చేస్తున్నాయి. నిత్యం లక్షల్లో ప్రజలు ఈ విష జ్వరాల బారినపడి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ప్రతిరోజూ ఈ ఆస్పత్రుల ముందు జనం క్యూలు కడుతున్నారు. వారిలో వేలాది మందికి ప్లేట్‌లెట్స్‌ పడిపోవడంతో ప్రాణాలకు భరోసా దక్కడం లేదు. ఈక్రమంలోనే రోగులకు అవసరమైన మేర బ్లడ్‌ దొరకడం కష్టంగా మారుతోంది. ఈనేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా బ్లడ్‌ బ్యాంకుల ఏర్పాటుపై పాలకులు దృష్టిసారించాలని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. అయితే, హోల్‌ బ్లడ్‌, బ్లడ్‌లోని వివిధ భాగాలు (ప్లేట్‌లెట్స్‌) వంటివి అవసరమైన రోగుల ప్రయోజనాల కోసం రాష్ట్రంలో బ్లడ్‌ బ్యాంకులు కాకపోయినప్పటికీ కనీసం బ్లడ్‌ సెంటర్లను అయినా చేయవలసి ఉందని పలువురు వైద్యులు, వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఏర్పాటు చేయడం ద్వారాబ్లడ్‌ సరఫరాలో కొరతను తొలగించవచ్చని అంటున్నారు. అంతేకాకుండా రోగులను సకాలంలో రక్షించడంలోనూ ఇవి ఎంతగానో సహాయపడతాయని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 40 ప్రభుత్వ బ్లడ్‌ సెంటర్లు ఉండగా మరో 10 బ్లడ్‌ స్టోరేజీ నిల్వ కేంద్రాలు ఉన్నాయి. అయితే, ఈఆర్థిక సంవత్సరంలో మరో ఏడు బ్లడ్‌ స్టోరేజీ కేంద్రాలను బ్లడ్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేయబోతున్నారు. ప్రతిపాదిత బ్లడ్‌ స్టోరేజీ సెంటర్లన్నింటినీ బ్లడ్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తే ఏపీలో 57 బ్లడ్‌ సెంటర్లు రానున్నాయి. ఇవన్నీ కలిపితే పేద రోగులకు ఆపద సమయంలో ఎంతగానో ఉపయోగపడనున్నాయి. 2021-22 నాటికి, ఏపీలో 174 రక్త కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే 40 సెంటర్లు మినహాయిస్తే మిగిలిన 134 ప్రైవేటు- రంగంలో ఉన్నాయి. అలాగే, రాష్ట్రంలో ప్రభుత్వ నియంత్రణలో 111 రక్త నిల్వ కేంద్రాలు ఉన్నాయి. అయితే కొత్తగా 65 రక్త నిల్వ కేంద్రాలను ప్రారంభించేందుకు అనుమతి ఉంది. ఈనేపథ్యంలోనే వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు వీటికి అవసరమైన పరికరాలను సమకూర్చి వాటిని ఉపయోగంలోకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు. అదే సమయంలో 17 బ్లడ్‌ స్టోరేజీ కేంద్రాలను బ్లడ్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు.

వచ్చే ఏడాది మరో 25 కేంద్రాల ఏర్పాటు

డ్డు ప్రమాదాలు మరియు వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్సలకు హోల్‌ బ్లడ్‌తోపాటు దాని వివిధ భాగాలకు భారీ డిమాండ్‌ ఉందని రాష్ట్ర ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. రోగులకు రక్తం తక్షణమే అందుబాటు-లో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఏరియా మరియు జిల్లా ఆసుపత్రులలో ఇప్పటికే ఉన్న బ్లడ్‌ స్టోరేజీ సెంటర్లను అప్‌గ్రేడ్‌ చేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరో 25 బ్లడ్‌ స్టోరేజీ సెంటర్లను ఏర్పాటు- చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. కొన్ని జిల్లాలలో ప్రస్తుత పరిస్థితికి భిన్నంగా, హోల్‌ బ్లడ్‌ మరియు రక్తంలోని వివిధ భాగాలు రోగులకు అందుబాటు-లో ఉండేలా 1:2 నిష్పత్తిలో బ్లడ్‌ సెంటర్లు మరియు బ్లడ్‌ స్టోరేజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ఒకటి లేదా బ్లడ్‌ సెంటర్లు మాత్రమే అందుబాటు-లో ఉన్నాయి. ఇది రోగులకు రక్తం మరియు దాని భాగాలను వెంటనే అందించేందుకు కష్టతరంగా మారుతుందని మరికొంత మంది నిపుణులు చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు దీనిపై స్పందించి వెంటనే రోగులకు అవసరమైన మేర బ్లడ్‌ సెంటర్లు, బ్లడ్‌ స్టోరేజీ సెంటర్లను ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే వీటినీ ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement