Saturday, November 23, 2024

ట్రాన్స్‌కో ఈహెచ్‌టీ సబ్‌ స్టేషన్లలో ఈఈ చర్యల అమలు.. పూర్తికావస్తున్న పనులు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి మరియు విద్యుత్‌ వినియోగదారులందరికీ దాని ప్రయోజనాలను అందించడం ద్వారా గణనీయమైన ఫలితాలను సాధించడం కోసం విద్యుత్‌ సంస్థల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయడంపై ఇంధన శాఖ పూర్తిగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏపీ ట్రాన్స్‌కో సుమారు 158 అదనపు హై టెన్షన్‌ (ఈహెచ్‌ట్‌) సబ్‌స్టేషన్‌లలో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం ద్వారా సబ్‌స్టేషన్‌లలోని సహాయక యూనిట్‌లకు ఇంధన వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడేలా నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం), స్టేట్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీసీడ్‌కో) సహకారంతో రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో ఈచర్యలను ముమ్మరం చేయనుంది.

ఈమేరకు ఇంధన శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కే విజయానంద్‌, జెన్‌కో జేఎండీ కేవీఎన్‌ చక్రధర బాబు విద్యుత్‌ శాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆదివారం వర్చువల్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంధన సామర్థ్య చర్యలను వివరించారు. 9 వాట్స్‌ ఎల్‌ఈడీ బల్బులు, 20 వాట్స్‌ ఎల్‌ఈడీ ట్యూబ్‌ లైట్లు, అధిక సామర్థం గల బీఎల్‌డీసీ (బ్రష్‌లెస్‌ డైరెక్ట్‌ కరెంట్‌) ఫ్యాన్లు, 70 వాట్స్‌, 110 వాట్స్‌ యార్డ్‌, 190 వాట్ల ప్లడ్‌ లైట్లు వంటి ఇంధన సామర్థ్య విద్యుత్‌ ఉపకరణాలతో ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్‌లలోని పాత విద్యుత్‌ ఉపకరణాలను భర్తీ చేయడం పూర్తయిందన్నారు. రాష్ట్రంలోని గుంటూరు, ఒంగోలు, కృష్ణా, నెల్లూరు సర్కిళ్లలో విజయవాడ జోన్‌లోని ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన 70 ఈహెచ్‌టీ సబ్‌ స్టేషన్లలో ఇంధన సామర్థ్య చర్యల అమలుకు ఏపీఎస్‌ఈసీఎంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుని ఆపనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

ఈసబ్‌స్టేషన్‌లన్నింటిలో ఎనర్జీ ఎఫెక్టివ్‌ ఉపకరణాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇవే కాకుండా ట్రాన్స్‌కో, ఏపీ స్టేట్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో కలిసి విశాఖపట్నం జోన్‌లోని 69 ఈహెచ్‌టీ- సబ్‌స్టేషన్‌లు మరియు కడప జోన్‌లోని 102 ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్లలో ఇంధన సామర్థ్య చర్యలను చేపట్టిందని తెలిపారు. వీటిలో విశాఖపట్నం మండలంలో 35, కడప మండలంలో 53 సబ్‌స్టేషన్లలో ఈఈ చర్యలు చేపట్టామన్నారు.

ఇంధన సామర్ధ్య ఉపకరణాలు ఇలా..

ఏపీఎస్‌ఈసీఎం డేటా ప్రకారం 9 వాట్ల ఎల్‌ఈడీ బల్బులు 1100, 20 వాట్ల ఎల్‌ఈడీ ట్యూబ్‌ లైట్లు 3026, 35 వాట్ల బీఎల్‌డీసీ ఫ్యాన్లు 884, 70 వాట్ల ఎల్‌ఈడీ వీధి దీపాలు 263, 110 వాట్ల ఎల్‌ఈడీ వీధి లైట్లు 2441, 190 వాట్స్‌ ప్లnడ్‌ లైట్లు 342 వంతేప ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌లలో ఇప్పటికే ఉన్న పాత లైటింగ్‌ సిస్టమ్‌ స్థానంలో విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 70 సబ్‌స్టేషన్‌లలో సుమారుగా 2.58 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ పొదుపులు చేయడం జరిగిందని తెలిపారు. దీనిద్వారా సంవత్సరానికి రూ.1.87 కోట్ల మేర ఆదా జరిగిందన్నారు. రూ.1.52 కోట్ల పెట్టుబడితో 10 నెలల్లో పెట్టుబడిపై రాబడిని అంచనా వేయడం జరిగిందని వివరించారు.

ఆర్థికాభివృద్ధికి ఇంధనం ప్రధాన కారణమని, ఇంధన భద్రతలో ఇది ముఖ్య భాగమని అన్నారు. రాష్ట్రాన్ని తక్కువ ఖర్చుతో కూడుకున్న విద్యుత్‌కు గమ్యస్థానంగా మార్చాలనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యాన్ని సాధించడానికి ఇంధన సామర్థ్యం అత్యంత శక్తివంతమైన సాధనాల్లో ఒకటని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర వృద్ధిని ప్రోత్సహించడంలో, ఉపాధి కల్పనలో మరియు తక్కువ ఖర్చుతో కూడిన ప్రాతిపదికన ఇంధన అవసరాలను తీర్చడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ రంగంలో ఇంధన సామర్థ్య చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంతృప్త ప్రాతిపదికన విద్యుత్‌ రంగంలో ఈఈ చర్యలను అమలు చేయడం లక్ష్యంగా పెట్టు-కుందని ప్రత్యేక సీఎస్‌ అన్నారు.

ప్రసార నష్టాల తగ్గింపే లక్ష్యంగా..

ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్‌లలో ఇంధన సామర్థ్య చర్యలతో పాటు, ట్రాన్స్‌కో 2.8 శాతంలోపు ఉన్న ట్రాన్స్‌మిషన్‌ నష్టాన్ని తగ్గించే చర్యలను చేపట్టిందని జెన్‌కో జేఎండీ కేవీఎన్‌ చక్రధర బాబు చెప్పారు. ఇది దేశంలోనే అత్యల్ప ప్రసార నష్టాలలో ఒకటి అని వివరించారు. కొత్త హెచ్‌టి లైన్‌లను ఏర్పాటు- చేయడం మరియు పాత లైన్‌లను మార్చడం, ఇహెచ్‌టి సబ్‌స్టేషన్లలో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ల పెంపుదల, కెపాసిటర్‌ బ్యాంక్‌ లేదా రియాక్టర్‌లను ఇన్‌స్టాల్‌ చేయడం ద్వారా రియాక్టివ్‌ పవర్‌ మేనేజ్‌మెంట్‌ వంటి చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు. ఏపీ ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌లు కాలానుగుణ నిర్వహణ మరియు అంతరాయాలను తగ్గించడానికి లైన్‌ పెట్రోలింగ్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. సబ్‌స్టేషన్‌లలోని పరికరాలు పెద్ద మొత్తంలో వేడెక్కడం వల్ల కాలిపోయి నష్టపోవాల్సని పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

ముఖ్యంగా పెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌లు వద్ద తరచూ ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. ఆ విద్యుత్‌ను భర్తీ చేయడానికి పవర్‌ ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని, దీనికితోడు సబ్‌ స్టేషన్‌ నడవడానికి విద్యుత్‌ అవసరమని వెల్లడించారు. నియంత్రణలు లేకుండా సమానమైన లైటింగ్‌ ఫిక్చర్‌తో పోలిస్తే 80 శాతం కంటే ఎక్కువ శక్తిని ఆదా చేసే లైటింగ్‌ అప్‌గ్రేడ్‌లు మరియు స్మార్ట్‌ నియంత్రణలపై ట్రాన్స్‌కో దృష్టి సారిస్తోందని తెలిపారు. సబ్‌స్టేషన్‌కు సంబంధించిన శీతలీకరణ మరియు పంపింగ్‌ పరికరాలలో వేడి వెదజల్లడాన్ని ఆప్టిమైజేషన్‌తో సహా వాటి ప్రభావాన్ని ఖచ్చితమైన అంచనా వేయడానికి అనుమతించే పర్యవేక్షణ వ్యవస్థను కలిగి ఉండటానికి ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌లో ఇతర ఇంధన ఆదా అవకాశాలను అన్వేషిస్తోందని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement