Tuesday, November 26, 2024

రోడ్ల ప‌క్క‌న నిర్మాణ‌ల‌కు ఇంపాక్ట్ వాత‌.. వ్య‌తిరేకిస్తున్న బిల్డ‌ర్స్..

అమరావతి, ఆంధ్రప్రభ: పట్టణ ప్రాంతాల్లో రహదార్ల పక్కన నిర్మాణా లకు ఇంపాక్ట్‌ ఫీజు విధించేందుకు నిర్దేశిం చిన జీవో 117 పై ప్రభుత్వం పునరాలో చనలో పడ్డట్టు తెలుస్తోంది.. జీవో అమ లులో అధికారులకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి.. నగరపాలక సంస్థ లు, మునిసిపాల్టిలు, నగర పంచాయతీ లతో పాటు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు, రాజధాని ప్రాంత ప్రాథికార అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ), విశాఖ పట్టణం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో ఇంపాక్ట్‌ ఫీజు వసూలుకు గత ఏడాది ఆగస్టు 11వ తేదీన ప్రభుత్వం జీవో జారీ చేసింది. వ్యక్తిగత భవనాలు, అపార్టుమెంట్లు, రోడ్డు మార్జిన్‌లో నిర్మించే ఏ కట్టడానికైనా ఇంపాక్ట్‌ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఎక్కడైనా 60 అడుగులకు పైగా ఉన్న ప్రధాన రోడ్ల వెంట భవన నిర్మాణానికి అనుమతి తీసుకోవాలంటే ఇంపాక్ట్‌ ఫీజును తప్పనిసరి చేసింది. పట్ట ణాలు, నగరాల్లో పెరుగుతున్న జనాభా పట్టణీకరణ.. నగరీకరణ.. అవసరాలకు తగ్గట్టుగా మాస్టర్‌ప్లాన్‌ ల్యాండ్‌ యూజ్‌ పాలసీ, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు పెద్దఎత్తున వెచ్చించాల్సి రావటం ప్రభుత్వానికి కష్టతరంగా మారుతున్న నేపథ్యంలో ఇంపాక్ట్‌ ఫీజు వసూలుకు ప్రతిపాదనలు వచ్చాయి. దీన్ని ముందుగా ప్రయోగాత్మకంగా అమలు చేద్దామని భావించి ఆ తరువాత రాష్ట్రం మొత్తంగా అమల్లోకి తెస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. పురపాలక సంస్థలను స్వయం పోషకాలుగా తీర్చిదిద్దే క్రమంలో ఇంపాక్ట్‌ ఫీజు అదనపు ఆదాయ వనరుగా అందుబాటులో ఉంటుందనేది కూడా ప్రభుత్వ యోచన.

ఇదీ ఇంపాక్ట్‌ విధానం
మాస్టర్‌ప్లాన్‌ రోడ్లు, జాతీయ, రాష్ట్ర రహదార్లు, బైపాస్‌రోడ్లు, ఇన్నర్‌, అవుటర్‌ రింగురోడ్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో భూములకు గిరాకీ ఉంటుంది.. పట్టణాల్లో సాధారణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కంటే అదనంగా ఇక్కడ వసతుల కల్పన జరగాలి.. దీనివల్ల పెద్దఎత్తున భూముల ధరలు పెరుగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రభావ రుసుం చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన రోడ్ల చెంతన నిర్మించే భవనాలకు, కట్టడాలకు ప్లాన్‌లు మంజూరు చేసే సమయంలోనే ఇంపాక్ట్‌ ఫీజు చెల్లించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీనివల్ల పట్టణాభివృద్ధి విస్తరణకు అవసరమైన ఆదాయ వనరులు సమకూర్చుకోవటంతో పాటు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా (ఉడా) బలోపేతం కాగలవనేది ప్రభుత్వ భావన. పట్టణాలు..నగరాలు..ఉడాలు.. నగర పంచాయతీల పరిధిలో 60 అడుగుల నుంచి 150 అడుగుల రహదార్లకు ఇరువైపులా 250 మీటర్ల పరిధిలో నిర్మించే భవనాలకు ఇంపాక్ట్‌ ఫీజు వర్తిస్తుంది. భవన నిర్మాణానికి అనుమతిచ్చే సమయంలో దీన్ని చెల్లించాలి. గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ), విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (వీఎంసీ), గుంటూరు మునిసిప్‌ కార్పొరేషన్‌ (జీఎంసీ)లు ఓ కేటగిరీగా, మిగిలిన నగరపాలక సంస్థలు రెండో కేటగిరీగా, మునిసిపాల్టిdలు, నగర పంచాయతీలు 3వ కేటగిరీగా గుర్తించటంతో పాటు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో చదరపు గజానికి ఇంపాక్ట్‌ ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో మార్కెట్‌ ధరలకు అనుగుణంగా స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ సమన్వయంతో ఫీజులు వసూలు చేయాలని నిర్దేశించింది.

కేటగిరీల వారీగా ఫీజులు
కేటగిరి 1లో 18 మీటర్ల నుంచి 45 మీటర్ల రహదార్ల పక్కన జీవీఎంసీ, జీఎంసీ, వీఎంంసీల పరిధిలో 500 చదరపు మీటర్లలో నిర్మాణాలకు చదరపు మీటరు రూ. 1614 చొప్పున లేదా మొత్తం మార్కెట్‌ విలువలో 3 శాతం, 2వ కేటగిరీ పరిధిలో మొత్తం విలువలో 2 శాతం లేదా చదరపు మీటరు రూ. 1076, 3వ కేటగిరీలో 2శాతం లేదా రూ. 807, నాలుగో కేటగిరీలో 2 శాతం లేదా చదరపు మీటరు 538 చొప్పున లెక్కిస్తారు. ఐదువందల చదరపు మీటర్ల కంటే తక్కువగా ఉంటే అన్ని కేటగిరీలకు 2 శాతం మార్కెట్‌ విలువతో పాటు రూ. 807, రూ. 538, రూ. 538, రూ. 269 చొప్పున వసూలు చేస్తారు. 45 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రహదార్ల పక్కన రెసిడెన్షియల్‌ భవనాలకు కేటగిరీల వారీగా 2 శాతం మార్కెట్‌ విలువ ప్రాతిపదికన లేదా చదరపు మీటరు రూ. 807, 538, 538, 269 చొప్పున, వాణిజ్య, 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న పారిశ్రామిక భవనాలకు చదరపు మీటరు రూ. 150, 100, రూ. 807, ఉడాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు చదరపు అడుగుకు రూ. 50 చొప్పునఇంపాక్ట్‌ ఫీజు చెల్లించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఉడాల పరిధిలోని నగర పంచాయతీలు, పట్టణాలకు ఇంపాక్ట్‌ ఫీజు దామాషా ప్రకారం బదలాయిస్తారు.

తీవ్ర వ్యతిరేకత
ప్రధాన రహదార్ల పక్కన భవనాల నిర్మాణానికి పెద్దఎత్తున ఇంపాక్ట్‌ ఫీజు వసూ లు చేయటాన్ని పట్టణ పౌరసంఘాల సమాఖ్యతో పాటు వివిధ సంఘాలు వ్యతి రేకించాయి.. కాగా జీవో జారీచేసి ఏడాది సమీపిస్తున్నా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారి టీలు, సీఆర్‌డీఏ, నగరపాలక సంస్థలు పటి ష్టంగా అమలు చేయలేకపోతున్నాయనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.. దీంతో ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచిస్తు న్నట్లు తెలియవచ్చింది. ఇంపాక్ట్‌ ఫీజు స్థానే కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేయట మా? లేదా కొనసాగించటమా? అనే విషయ మై త్వరలో స్పష్టత రానుంది.. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పురపాలకశాఖ సమీక్ష సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సిబ్బంది కొరతతో పాటు పురపాలక, ఉడా పాలకవర్గాలకు దీనిపై అవగాహన లేకపోవటంతో కొందరు వ్యక్తిగత ప్లాన్‌లు తీసుకునే భవన యజమానులు స్వచ్ఛందంగా ప్లాన్‌ కోసం చెల్లిస్తున్నారు తప్ప మొత్తంగా ఆచరణ సాధ్యం కావటంలేదని అధికారులు చేతులెత్తేసినట్లు సమాచారం. దీంతో సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పున పరిశీలిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement