Friday, November 22, 2024

Rain Alart: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం ఇది చెన్నైకి ఆగ్నేయ దిశగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ గురువారం సాయంత్రానికి తమిళనాడులోని కారైక్కల్, ఏపీలోని శ్రీహరికోటల మధ్య సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీర ప్రాంతాల్లో 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది.

కాగా, అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులోని ఉత్తర కోస్తా జిల్లాల్లో బుధవారం కుండపోత వర్షాలు కురిశాయి. చెన్నై సమీపంలోని చెంగల్పట్టు, తిరువల్లూర్, కాంచీపురం, విల్లుపురంలో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. ఇక, నాగపట్టణం, తిరుప్పూండి ప్రాంతాల్లో అత్యధికంగా 31 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కరైకల్‌లో 29, వేదారణ్యం 25 సెం.మీ. వంతున నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర చెన్నై, తమిళనాడు డెల్టా ప్రాంతాల్లోని 8 జిల్లాలకు గురువారం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. 

ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement