ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని జీజంబులదిన్నె గ్రామంలో 40 మంది అస్వస్థతకు గురవ్వగా.. రెండ్రోజుల్లో ముగ్గురు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామంలో ప్రజలు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారు. గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి.. బాధితులకు చికిత్స అందిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి గ్రామంలో పర్యటించారు. అనంతరం వైద్య శిబిరంలో వైద్యులను.. అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు.. గ్రామంలో తాగునీటి నమూనాలు పరీక్షిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement