Sunday, September 29, 2024

తిరుపతిలో ఐఐఎస్ఈఆర్‌కు రూ. 1491.34 కోట్లు, హాస్టల్ భవనాలు, ల్యాబ్ నిర్మాణం పూర్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తిరుపతిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)’ నిర్మాణం, ఖర్చుల కోసం రూ. 1491.34 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీలు చింత అనురాధ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డా. సుభాష్ సర్కార్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడించారు.

2015లో తిరుపతిలో ఈ విద్యాసంస్థను ఏర్పాటు చేశామని, శాశ్వత క్యాంపస్ నిర్మాణం కోసం కేంద్ర మంత్రివర్గం రూ. 1491.34 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. ఇందులో మూలధనం కింద రూ. 1137.16 కోట్లు, పునరావృతమయ్యే ఖర్చుల కోసం రూ. 354.18 కోట్లు కేటాయించిందని తెలిపారు. 2018 మే నెలలో శాశ్వత క్యాంపస్ నిర్మాణం మొదలైందని తెలిపారు. విద్యార్థుల హాస్టల్ భవనాల నిర్మాణం 2020 ఆగస్టులో పూర్తయిందని, అండర్‌గ్రాడ్యుయేట్ ల్యాబ్ నిర్మాణం 2019 జూన్లో మొదలై, 2020 అక్టోబర్లో పూర్తయిందని తెలిపారు. ఇతర ప్రధాన భవనాల నిర్మాణం 2020 అక్టోబర్లో మొదలైందని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement