Saturday, January 25, 2025

AP | విజయవాడలో ఇఫ్టోరియా మ్యూజికల్ నైట్…

  • ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
  • పాల్గొనున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్.
  • ఏర్పాట్లను పరిశీలించిన నారా భువనేశ్వరి…

( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : తల సేమియా తో బాధపడుతున్న బాధితుల సహాయార్థం విజయవాడలో ఇఫ్టోరియా మ్యూజికల్ నైట్ ను నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మ్యూజికల్ నైట్ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఫిబ్రవరి 15న నిర్వహించే ఈ మ్యూజికల్ నైట్ లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొనున్నారు.

దీనికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ఇందిరాగాంధీ స్టేడియం లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ట్రస్ట్, సిఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్ల పై సి పి రాజశేఖర్ తో కలిసి భువనేశ్వరి చర్చించారు.

స్టేడియం లో నిర్మాణం చేసే బ్లాక్ లు, వివిఐపిలకు మార్గం, ప్రజలు వచ్చే మార్గాలను భువనేశ్వరి కి పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు వివరించారు. పాస్ లు ఉన్న వారినే లోపలకు అనుమతి ఉండేలా చర్యలు తీసుకోవాలని సి పి రాజశేఖర్ బాబుకు భువనేశ్వరి సూచించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మ్యూజికల్ నైట్ ను వీక్షించేందుకు కుటుంబ సభ్యులు తో కలిసి అందరూ రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులు కొనే టిక్కెట్ డబ్బుతో తలసేమియా తో బాధ పడే వారికి సహకారం అందిస్తామన్నారు. సోషల్ కాజ్ తో ఐదు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన ఆమె ఒక్క సెంటర్ ఏర్పాటు కి అరవై లక్షలు ఖర్చు అవుతుందన్నారు.

తల సేమియా తో బాధపడుతున్న వారికి మందులు, రక్తం వంటి వాటికి చాలా ఖర్చు అవుతుందని, ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ మీట్, మందులు ఇప్పటికే ఇస్తున్నట్లు తెలిపారు. ఇది ఒక మంచి ఉద్దేశంతో చేసే కార్యక్రమం అని అందరూ తమ ఆపన్న హస్తం అందిస్తారని ఆశిస్తున్నాట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement