Friday, November 22, 2024

నానో యూరియా ప్లాంటు ఏర్పాటుకు ఇఫ్కో రెడీ.. 250 కోట్ల పెట్టుబడికి సన్నాహాలు

అమరావతి, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా నానో యూరియాకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా అన్ని రాష్ట్రాల్ల్రో ప్లాంట్ల ఏర్పాటు-కు భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) సన్నాహాలు చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్ల్రో తొలుత బెంగుళూరులో నానో యూరియా ప్లాంట్‌ స్థాపించిన ఇఫ్కో ఇపుడు ఏపీలో ప్లాంట్‌ ఏర్పాటు- చేయాలని నిర్ణయించింది. నానో యూరియా ప్లాంటు-కు నెల్లూరు జిల్లా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటు-ందని ఇఫ్కో భావిస్తోంది. నెల్లూరులో ప్లాంటు- స్థాపిస్తే ఏపీతో పాటు- తమిళనాడులోనూ పంపిణీ వ్యవస్థ వేగంగా ఉంటు-ందని అంచనా. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఇఫ్కో సంప్రదింపులు చేస్తోంది. భూముల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. అయిదవ నంబరు జాతీయ రహదారి, చెన్నై-కలకత్తా రైలు మార్గానికి సమీపంలో భూములు కేటాయిస్తే రవాణాకు అనుకూలాంశంగా ఉంటుందని ఇఫ్కో భావిస్తుంది. సుమారు కోటి లీటర్ల సామర్దంతో నెలకొల్పే ప్లాంటు- కోసం కనీసం 20 ఎకరాలు అవసరం.

అగ్రి సెజ్‌ లో భాగంగా ప్లాంటు-ను నెలకొల్పాలని ఇఫ్కో భావిస్తోంది. ఈ ప్లాంటు- తొలి దశ అంచనా వ్యయాన్ని రూ 250 కోట్లు-గా నిర్దారించారు. రైతాంగం కొన్ని దశాబ్దాలుగా గుళికలు, పౌడరు రూపంలో సంప్రదాయంగా వినియోగిస్తున్న లఎరువులకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా ద్రవరూపంలో అందుబాటు-లోకి వచ్చింది. ఇఫ్కో ప్రకటించిన ప్రామాణికతలను అనుసరించి 500 మిల్లీ లీటర్ల నానో యూరియా బాటిల్‌ 45 కిలోల సంప్రదాయ యూరియా బస్తాతో సమానం. ధర కూడా బస్తాతో పోలిస్తే 10 నుంచి 20 శాతం తక్కువగా ఉంది. పనిచేసే సామర్దం సాధారణ యూరియాతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నట్టు- ఇఫ్కో చెబుతోంది. యూరియా బస్తాలను కొనుగోలు చేసి తీసుకెళ్లేందుకయ్యే రవాణా ఖర్చుల భారం కూడా రైతులకు లేకుండా పోతుంది. భూసారం, భూగర్భ జలాలపై సంప్రదాయ యూరియా వల్ల పడే ప్రభావంతో పోలిస్తే నానో యూరియా వల్ల కలిగే దుష్పరిణామాలు చాలా తక్కువగా ఉన్నట్టు- ప్రయోగాల్లో వెల్లడైనట్టు- ఇఫ్కో చెబుతోంది.

రబీ సీజన్‌ లో రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా లీటర్ల నానో యూరియాను రైతులకు విక్రయించినట్టు- అంచనా. రబీలో 5.25 లక్షల నానో యూరియా బాటిల్స్‌ ను మార్కెట్‌ లో అందుబాటు-లో ఉంచగా సుమారు 4 లక్షల బాటిళ్లను విక్రయించారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ప్రయోగాత్మాకంగా నానో యూరియాను ప్రవేశపెట్టగా రైతుల నుంచి అంచనాకు మించి ఆదరణ ఉందని ఇఫ్కో ప్రకటించింది. వచ్చే ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ నాటికి నానో యూరియాతో పాటు- డీఏపీ, జింక్‌ ను కూడా ద్రవరూపంలో తీసుకురావాలని ఇటీ-వల నిర్వహించిన ఇప్కో ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement