శ్రీశైల దేవస్థానం కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కు ధరిస్తేనే మల్లన్న దర్శనం కల్పించాలని ఆలయ ఈవో లవన్న నిర్ణయించారు. మాస్కు ధరించకుండా శ్రీశైలం వీధుల్లో తిరిగేవారికి రూ. 100 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. భక్తులకు టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతే దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. ఇటీవల కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో.. కర్నూలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని లవన్న తెలిపారు. భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తామని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని మైక్ ద్వారా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో సూచనలు చేస్తున్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital