Wednesday, November 20, 2024

Threatening Call : బెదిరిస్తే… ఇక నిందితుల‌కు క‌ఠిన శిక్షలే… కేంద్ర మంత్రి

అక్టోబర్ 14వ తేదీ నుంచి నేటి వరకూ కొన్ని విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.. దాదాపు 100కు పైగా బెదిరింపులు రాగా.. తాజాగా ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ ఎయిర్ ఇండియా ప్రయాణికులను హెచ్చరించాడు. నవంబర్ 1 నుంచి 19 వరకూ ఆ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించవద్దని ప్రకటించాడు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడే వారిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎయిర్ క్రాఫ్ట్ సెక్యూరిటీ నిబంధనల్ని సవరిస్తామని తెలిపారు. అలాగే బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని ఇకపై విమానంలో ప్రయాణించకుండా నో ఫ్లై లిస్ట్ లో చేర్చుతామని ప్రకటించారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బెదిరింపులకు పాల్పడటం కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తామన్నారు. ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని తెలిపారు. శిక్ష, జరిమానాలకు సంబంధించిన నిబంధనలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇకపై విమానయాన సంస్థలు, సంబంధిత శాఖ అధికారులు ప్రోటోకాల్ ను అనుసరిస్తాయని చెప్పారు.

ఇలాంటి బెదిరింపులను చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని, వాటిని ఒక పద్ధతిలో పరిష్కరించాలని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చట్టం 1982కి వ్యతిరేకంగా జరుగుతున్న చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అణచివేసేలా సవరణలు చేయాలని భావిస్తున్నామని, ఇందుకోసం ఇతర మంత్రిత్వ శాఖలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. బెదిరింపుల కారణంగా గతవారం 8 విమానాలను దారిమళ్లించాల్సి వచ్చిందని, అలా చేయడం అంత సులభమైనది కాదన్నారు. బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు జరుగుతోందని మంత్రి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement