తనను గొడవలోకి లాగితే చీరేస్తా సన్నాసి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ… బంతీ చామంతి పూబంతి మూసుకొని నీపని నువ్వు చేసుకో అన్నారు. ఏమయ్యా కొట్టూ నా రాజకీయం ఏంటో నీకు చేసి చూపిస్తానన్నారు. ఏమయ్యా కొట్టూ.. కొట్టులో కూర్చో అన్నారు. తనతో పిచ్చ పిచ్చ వాగుడు వాగకండి అన్నారు.
వైసీపీలో ఉన్న వెధవ వాగుడు వాగే కాపు నేతలను హెచ్చరిస్తున్నానన్నారు. మీ నేతకు అడుగులకు మడుగులు వత్తితే నాకేం అభ్యంతరం లేదన్నారు.. కానీ కులాన్ని తగ్గించొద్దన్నారు. జ్యోతీరాం పూలే గులాంగిరీ చదవండి అన్నారు. మీరు గులాంగిరీ చేసి కులాన్ని ఎందుకు గులాంగిరీ చేస్తున్నారని అన్నారు. రాయలసీమ వెనుకబాటు తనానికి మీరే కదా కారణమన్నారు. కులం మీవెంట లేదుా సన్నాసుల్లారా ? అన్నారు. కులాన్ని కించపరిస్తే నాలుక కోస్తా అన్నారు.