Saturday, November 23, 2024

ప‌ద్ద‌తి మార్చుకోక‌పోతే వైసీపీకి గుణ‌పాఠం త‌ప్ప‌దు : డీఎల్

జ‌గ‌న్ పాల‌న‌లో కేవ‌లం కొంత మందికి మాత్ర‌మే న్యాయం జ‌రిగింద‌ని, ప‌ద్ద‌తి మార్చుకోక‌పోతే రానున్న ఎన్నిక‌ల్లో వైసీపీకి ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి అన్నారు. సీఎం జగన్ పై ఆయ‌న‌ మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ ఏది చెపితే దానికి తలలు ఊపుతూ అధికారులు సంతకాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ జగన్ పాలనలో ఓడిపోయారని చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఎంతో ఉపయుక్తమైన అభయహస్తం పథకానికి కూడా జగన్ తూట్లు పొడిచారని మండిపడ్డారు. విద్యా దీవెన వంటి ఎన్నో పథకాలు నిర్వీర్యమైపోయాయని చెప్పారు. ప్రతి పథకానికి వైయస్సార్ పేరు పెట్టి ఆయన పేరును చెడగొడుతున్నారని విమర్శించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement