Saturday, November 23, 2024

రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే రాజా ద్రోహం కేసులా ? : ఎంపీ రఘురామ

12 ఆఫ్ 2021 కేసులో నాకు నోటీసులు ఇచ్చారు.. రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే రాజా ద్రోహం కేసులు పెడతారా…? అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఆయ‌న‌కు ఇవాళ నోటీసులు అందజేశారు ఏపీ సీఐడీ అధికారులు. గతంలో ఆయనపై నమోదైన కేసులకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఐడీ అధికారులు రఘురామ కృష్ణరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.. రఘురామకృష్ణరాజుపై 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ.. ఇవాళ హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు.. ఈ నెల 17వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, సీఐడీ నోటీసులపై ఆయ‌న స్పందించారు. సీఐడీ అధికారులు నోటీసులిఇచ్చారు..

ఈ నెల 17న విచారణకు హాజరవుతానన్న ఆయన.. నేను చట్టాలను అనుసరిస్తాను… గతంలో నన్ను అరెస్ట్ చేసే సమయంలో సీసీటీవీ కెమెరాలు లేకుండా చేశారన్నారు. నా సిబ్బందిపై, నా పై వ్యక్తి గతంగా దాడి చేశారు.. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన వివరాలు సమర్పించాను అన్నారు. వ్యక్తి గత కక్షలో భాగంగానే నాకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఇక, ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత నేను ఓ నిర్ణయం తీసుకుంటాను.. ఏపీలో ఉన్న పార్టీలు, ప్రజలందరూ ఒకటి కావాలని పిలుపునిచ్చారు. ఇక, ముఖ్యమంత్రి జగన్ పేదలకు భూములు ఇస్తున్నట్లు నిన్న బ్రోచర్ విడుదల చేసారు… రియల్ ఎస్టేట్ చేస్తున్నట్లు నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారని ర‌ఘురామ కృష్ణంరాజు సెటైర్లు వేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement