ఒకప్పటి లెక్క నక్సల్స్ ఉండి ఉంటే.. టీఆర ఎస్ లీడర్ల బయట కాలుపెట్టే వారు కాదని, ఇప్పుడు రాజకీయాల మొత్తం డబ్బుతో ముడిపడి ఉన్నాయన్నారు మాజీ మంత్రి, సీనియర్ లీడర్ కొండా సురేఖ. అయితే.. తాను, తన కుటుంబం ఎప్పటికీ వైఎస్సార్ అభిమానులుగానే ఉంటామని, ఆయన వల్లే తాము సంతోషంగా ఉన్నామన్నారు.
దేశంలో ప్రస్తుతం రాజకీయాలు ఘోరంగా ఉన్నాయని, బీజేపీ వల్ల డబ్బు రాజకీయమే నడుస్తోందన్నారు మాజీ మంత్రి కొండా సురేఖ. సోమవారం ‘కొండా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వచ్చిన సందర్భంగా సురేఖ విజయవాడలోని కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. వైఎస్సార్ విగ్రహం నుంచే కొండా సినిమా ప్రమోషన్స్‌ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ…‘కొండా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ వచ్చినట్టు తెలిపారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులులర్పించి ఏపీలో టూర్ ప్రారంభించామని, వైఎస్సార్ వల్లే తాము ఇట్లా ఉన్నామన్నారు సురేఖ. కాగా, వైఎస్సార్‌కు తమ కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందని, ప్రస్తుతం రాజకీయాలు పాడైపోయాయన్నారు. అయితే రాజకీయాలకు అతీతంగా తాను ఈ సినిమా గురించే మాట్లాడుతున్నట్టు తెలిపారు.
తమ కుటుంబం మొత్తం వైఎస్సార్ అభిమానిగా ఉంటామని, తాను కాంగ్రెస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నట్టు తెలిపారు కొండా సురేఖ. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి తాను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక.. తమ లవ్ స్టొరీ, నక్సల్స్ జీవితం, రాజకీయ జీవితం వంటి అంశాలతో ‘కొండా’ సినిమా నిర్మించినట్టు తెలిపారు. అప్పట్లో ఉన్న నక్సల్స్ ఉండి ఉంటే ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు బయటకు వచ్చేవారు కాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను టీఆర్ఎస్ వెనక్కి తీసుకుందని మాజీ మంత్రి కొండా సురేఖ మీడియా మీట్లో వెల్లడించారు.