Wednesday, November 20, 2024

AP: హంత‌కులు అధికారంలో ఉంటే న్యాయం ఎలా…. సునీత రెడ్డి

అయిదేళ్లుగా పోరాడుతున్నా… వివేక హంతకుల‌ను
సైతం విచార‌ణ సంస్థ‌లు గుర్తించ‌లేక‌పోవ‌డం దౌర్భ‌గ్య‌మే
కంటి ముందు నిందితులు తిరుగుతున్నా…
ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితి నాది..
ఇప్పుడు అవినాష్ ఓట‌మే నా ల‌క్ష్యం..
ష‌ర్మిల విజ‌యానికి సంపూర్ణంగా కృషి చేస్తా..

హైదరాబాద్‌: వైఎస్‌ వివేకాను హత్య చేసిన వారు దర్జాగా బయట తిరుగుతుంటే వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదన్నారు. హైదరాబాద్‌లో ఆమె ఇవాళ‌ మీడియాతో మాట్లాడుతూ… వివేకా హత్యపై ఐదేళ్లుగా జరుగుతున్న పోరాటంలో ఎన్ని కష్టాలుంటాయో ఇప్పుడు అర్థమైందని చెప్పారు. తనకు చదువు, తెలివి, స్థోమత ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి అని వివరించారు. అవినాష్‌ రెడ్డిని గెలవకుండా చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తన పోరాటం రాజకీయం కోసం కాదని.. న్యాయం కోసమని స్పష్టం చేశారు. ష‌ర్మిల విజ‌యానికి శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తానని చెప్పారు.

2009కి ముందు వైఎస్‌ఆర్‌, వివేకా ఎవరో ఒకరు కడప ఎంపీగా పోటీ చేశార‌న్నారు. వైఎస్‌ఆర్‌ చనిపోయిన సమయంలో జగన్‌ ఎంపీగా ఉన్నార‌ని అంటూ పులివెందులలో ఎవరు పోటీ చేయాలనే అంశంపై చర్చ జరిగింద‌ని వివ‌రించారు. చర్చలో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి పేరు ముందుకు వచ్చింద‌ని అంటూ భాస్క‌ర్ రెడ్డి పోటీ త‌న తండ్రి వివేకా అంగీకరించలేద‌న్నారు.. షర్మిల లేదా విజయమ్మ పోటీ చేయాలని వివేకా సూచించార‌ని తెలిపారు. ఈ సమయంలో వివేకాకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించింద‌ని, అయితే.. దీనిని జగన్‌ వ్యతిరేకించార‌ని సునీత చెప్పారు. ఆ తర్వాత జగన్‌, విజయమ్మ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బయటకు వ‌చ్చి 2011 ఉప ఎన్నికలో జగన్‌, విజయమ్మ పోటీ చేశార‌న్నారు. ఆ తర్వాత జగన్‌తో ఉండాలని నిర్ణయించి వివేకా కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చార‌ని వివ‌రించారు.

- Advertisement -

ఆ తర్వాత సీబీఐ కేసుల్లో జగన్‌ అరెస్టయి జైలులోకి వెళ్లార‌ని, ఆ స‌మ‌యంలో . షర్మిల పార్టీని భుజాన వేసుకుని నడిపించింద‌ని గుర్తుచేశారు. జగన్‌ వెంట వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామా తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో షర్మిల ప్రచారం చేసి వారిని గెలిపించార‌న్నారు. ఉప ఎన్నికల్లో విజయం తర్వాత షర్మిలకు ఆదరణ వస్తోందని తెలిసి జ‌గ‌న్ ఆమెను పక్కనపెట్టార‌న్నారు. 2014 ఎన్నికల్లో కడప నుంచి ఆమె పోటీ చేస్తారని అందరూ భావించార‌ని, అయితే.. ఆ స్థానాన్ని అవినాష్‌ రెడ్డికి ఇవ్వాలని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్పారు.. అవినాష్ పోటీకి వివేకాకు ఇష్టం లేద‌న్నారు.. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా అవినాష్‌ కుటుంబం వెన్నుపోటుతో ఆయన ఓటమిపాల‌య్యార‌ని అన్నారు.. నా కుటుంబంలోని వారే వివేకాను హత్య చేశారని విష‌యం ముందు తాను నమ్మలేద‌ని, ఆ త‌ర్వాత విష‌యం తెలిసి ఆశ్చ‌ర్య‌పోయాన‌ని సునీతా చెప్పారు. అయిదేళ్ల‌గా న్యాయం కోసం పోరాడుతున్న‌త‌న కుటుంబానికి ఇప్ప‌టి వ‌ర‌కూ అది ల‌భించ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హంత‌కులే అధికారంలో ఉంటే న్యాయం ఎలా ల‌భిస్తుంద‌ని క‌న్నీరు పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement