ఏపీలో మద్యం అక్రమాలపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మద్యం అక్రమ విక్రయాలు, అధిక ధరలకు భారీ జరిమాన విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించే వారిపై రూ.5 లక్షల జరిమానా విధించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. జరిమానా విధించిన తర్వాత కూడా మళ్లీ అదే తప్పు చేస్తే మద్యం షాపు లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.