Saturday, November 23, 2024

50 మార్కులకన్నా తగ్గితే.. బెటర్‌మెంట్‌ రాయొచ్చు : డీజీఈ

అమరావతి, ఆంధ్రప్రభ: పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో 50 మార్కుల కన్నా తక్కువ(49 లేదా అంతకన్నా తక్కువ) వచ్చిన వారు బెటర్‌మెంట్‌ రాసుకునేందుకు అవకాశం కల్పించింది. విద్యార్థులు ఏవైనా రెండు సబ్జెక్టులు రాసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానంద రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

సప్లిమెంటరీతోపాటు బెటర్‌ మెంట్‌ పరీక్షలు కూడా జరుగుతాయన్నారు. సబ్జెక్టుకు రూ. 500, రెండింటికైతే రూ. వెయ్యి చెల్లించి బెటర్‌ మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఏడాది పరీక్షలకు మాత్రమే బెటర్‌ మెంట్‌ వెసులుబాటు- కల్పిస్తున్నామన్నారు.ఈ నెల 16 నుంచి 19లోగా బెటర్‌మెంట్‌ పరీక్షల ఫీజు చెల్లించాలని చేసుకోవాలని, అందుకోసం సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement