Friday, November 22, 2024

AP: న్యాయం చేయకుంటే.. కుటుంబమంతా ఆందోళనకు దిగుతాం: జేసీ ప్రభాకర్‌రెడ్డి

అనంతపురం: వైకాపా ప్రభుత్వ హయాంలో బస్సుల కొనుగోలు విషయంలో తమను దొంగలంటూ జైలుకు పంపారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ”నా బస్సులపై తప్పుడు కేసులు నమోదు చేశారు. బీఎస్‌ 3 వాహనాలు అమ్మినవారు, రిజిస్ట్రేషన్‌ చేసినవారు ఇంటికి పోయారు. 10 రోజుల్లో నాకు న్యాయం జరగాలి.

లేదంటే నా కుమారుడు, కోడలు ఎస్పీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తారు. నేను, నా భార్య డీటీసీ ఆఫీస్‌ ఎదుట నిరసన చేపడతాం. ఈ విషయం సీఎం చంద్రబాబు, ప్రభుత్వానికి సంబంధించింది కాదు. నా వ్యక్తిగత విషయం.. నాకు న్యాయం జరగాలి. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటే పార్టీకీ రాజీనామా చేస్తా” అని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement